AK 47 Gun MisFire At Ayodhya Ram Mandir Temple: వందల ఏళ్ల తర్వాత అయోధ్య భవ్యరామమందిరం నిర్మాణం కలసాకారమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అతీరథ మహారథులు, కులమతాలకు అతీతంగా హజరై రామ్ లల్లా విగ్రహా ప్రతిష్టాపనలో పాల్గొన్నారు. అయోధ్య రామలయ ట్రస్ట్ రాముడి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించింది. అయోధ్యకు కులమతాలకు అతీతంగా భక్తులు వచ్చి రామ్ లల్లాను దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో రాముడి ఆలయందగ్గర పోలీసులు, ఆర్మ్ డ్ ఫోర్స్ నిరంతరం గస్తీ కాస్తున్నారు.
Read More: Snake Facts: పాముశరీరంలోని ఆ భాగం ఇంట్లో పెట్టుకుంటే డబ్బే డబ్బు..
ప్రతిరోజు వేలాది భక్తులు రాముడి దర్శనానికి దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. తమ రాముడిని దర్శించుకుని భక్తులు మొక్కులు సైతం తీర్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. అయోధ్య రామమందిరం దగ్గర మంగళవారం రోజు ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆలయం పరిసర ప్రాంతాలలో భద్రత విధులు నిర్వహిస్తున్న ఫ్లటూర్ కమాండర్ ఏకే 47 రైఫిల్ నుంచి బుల్లెట్ ఒక్కసారిగా బుల్లెట్ దూసుకొచ్చింది.
ఫ్లటూన్ కమాండర్ రామ్ ప్రసాద్ (53) అనే వ్యక్తి విధులు నిర్వర్తిస్తుండగా.. తూటా ఒక్కసారిగా బైటకు వచ్చి ఇతని ఎడమఛాతీ నుంచి దూసుకుపోయింది. వెంటనే అక్కడున్న సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు.ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read More: Teen Girl Romance: నడిరోడ్డు మీద రొమాన్స్.. ఇద్దరమ్మాయిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు..
అయోధ్య రామమందిరం దగ్గర పేలుడు సంభవించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడున్న ఆలయ సిబ్బంది, భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఉన్నాతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన మాత్రం తీవ్ర దుమారంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook