UPSC Exam: ఆ సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు మరో ఛాన్స్ లేదని స్పష్టం చేసిన Supreme Court

UPSC Exam No Extra Chance: జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. కోవిడ్-19 కారణంగా చివరి ప్రయత్నంలో గత ఏడాది హాజరు కాలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చేది లేదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 24, 2021, 04:38 PM IST
  • గత ఏడాది హాజరు కాలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చేది లేదన్న ధర్మాసనం
  • సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది
  • రచనా సింగ్ అనే సివిల్ సర్వీసెస్ అభ్వర్థి పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది
UPSC Exam: ఆ సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు మరో ఛాన్స్ లేదని స్పష్టం చేసిన Supreme Court

UPSC Exam No Extra Chance: యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కోవిడ్-19 కారణంగా చివరి ప్రయత్నంలో గత ఏడాది హాజరు కాలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చేది లేదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల ఇదే విషయాన్ని సైతం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మసనానికి వివరించింది. జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది.

కరోనా మహమ్మారి కారణంగా 2020లో నిర్వహించిన సివిల్ సర్వీసెస్‌కు సరిగా ప్రిపేర్ కాలేదని, గతేడాది చివరి అవకాశం అయి ఉండి పరీక్షకు హాజరు కాలేకపోయిన వారికి మరో అవకాశం ఇవ్వాలని కోరుతూ రచనా సింగ్ అనే సివిల్ సర్వీసెస్(UPSC Civil Services) అభ్వర్థి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. తాము తొలుత అంగీకరించకపోయినా, కొన్ని కారణాలతో గత ఏడాది పరీక్ష రాయని వారికి అవకాశాన్ని ఇచ్చేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీం ధర్మాసనానికి తెలిపింది.

Also Read: Paytm Payments Bank: ఆ FASTag వినియోగదారులకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ శుభవార్త

కొందరు అభ్యర్థులకు మాత్రమే అవకాశాన్ని ఇవ్వడం పట్ల సరికాదని సుప్రీంకోర్టు(Supreme Court) భావించింది. కేవలం ఒక ఏడాది వారికి ఈ అవకాశం కల్పించినట్లయితే భవిష్యత్తులో మరికొందరు అభ్యర్థులు ఇలాంటి ప్రతిపాదనలతో వస్తారని, అదే సమయంలో కొందరు అభ్యర్థుల పట్ల వివక్ష చూపడం అవుతందని భావించిన సర్వోన్నత న్యాయస్థానం రచనా సింగ్ పిటిషన్‌ను కొట్టివేసింది. 

Also Read: BSNL ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీకు Double Data, అన్‌లిమిటెడ్ కాల్స్ సహా మరెన్నో ప్రయోజనాలు

కాగా, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను గత ఏడాది అక్టోబర్ 4న నిర్వహించాల్సి ఉండగా.. సెప్టెంబర్ 30న పరీక్ష వాయిదాపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది. అయితే చివరి అకాశం ఉన్న అభ్యర్థులు కరోనా కారణంగా పరీక్షకు హాజరుకాలేని వారికి మరో అవకాశం ఇవ్వడంపై యోచించాలని కేంద్ర ప్రభుత్వానికి, యూపీఎస్సీకి సుప్రీంకోర్టు సూచించింది. తాజాగా దీనిపై తుది తీర్పును సుప్రీం ధర్మాసనం వెలువరించింది.
Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు Supreme Court శుభవార్త 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News