8 UP Police Dead: కాన్పూర్: ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని (Uttar pradesh's kanpur encounter) బీతూర్‌లో నేరస్తుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసు బృందంపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో డిప్యూటీ ఎస్పీ, ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లతో సహా ఎనిమిది మంది పోలీసులు అమరులయ్యారు. మరో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు దుండగులను పోలీసులు మట్టుబెట్టారు.
గురువారం అర్థరాత్రి వికాస్ దుబే అనే గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకొనేందుకు పోలీసుల బృందం చౌబేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్రు గ్రామానికి వెళ్లింది. ఈ క్రమంలో దుండగులు ఇళ్ల పైకప్పుల నుంచి పోలీసులపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దుండగులు జరిపిన కాల్పుల్లో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా, ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు మహేష్ యాదవ్, అనూప్ కుమార్, అనూప్ కుమార్, నలుగురు కానిస్టేబుళ్లు నెబులాల్, సుల్తాన్ సింగ్, రాహుల్, జితేంద్ర, బబ్లు మరణించారు. గాయపడిన పోలీసులను రీజెన్సీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. Read also: SSC: 283 పోస్టులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్
Kanpur: ADG Law and Order Prashant Kumar visits spot of encounter in Bikaru village where 8 police personnel lost their lives after being fired upon by criminals pic.twitter.com/7mdJwK6bfG
— ANI UP (@ANINewsUP) July 3, 2020
నివాళులర్పించిన సీఎం యోగి..
అమరులైన పోలీసులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాళులర్పించి వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం యోగి ఆదేశించారు. ఈ మేరకు ఆయన అదనపు ప్రధాన కార్యదర్శి, డీజీపీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. Read also: సుశాంత్ ఆత్మహత్యపై సరోజ్ ఖాన్ చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్.. వైరల్
గ్యాంగ్‌స్టర్‌పై 60 క్రిమినల్ కేసులు: డీజీపీ
ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ డీజీపీ హెచ్‌సీ అవస్థీ మాట్లాడుతూ.. వికాస్ దుబే అనే కిరాతక నేరస్తుడు కాన్పూర్‌లో రౌడీషీటర్ అని పేర్కొన్నారు. ఆయనపై ఇప్పటివరకు 60 కేసులు నమోదయ్యాయని చెప్పారు. కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు రౌడీషీటర్‌ను పట్టుకునేందుకు విక్రు గ్రామానికి పెద్ద ఎత్తున పోలీసు బృందం చేరుకోగానే.. 10నుంచి 15మంది దుండగులు ఇళ్ల పైకప్పుల నుంచి కాల్పులు జరిపి ఎనిమిది పోలీసుల ప్రాణాలను బలితీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత నిందుతలంతా పరారయ్యారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని స్పష్టంచేశారు.
ఎస్ఎస్పీ, ఐజీ సంఘటనా స్థలానికి చేరుకోని పరిస్థితిని సమీక్షించారు. దర్యాప్తు కోసం కాన్పూర్ ఫోరెన్సిక్ బృందం, ఎస్టీఎఫ్‌ను కూడా నియమించారు. నేరస్థులను పట్టుకునేందుకు వికాస్ దుబే సన్నిహితుల 100కి పైగా మొబైల్ ఫోన్లను ట్యాపింగ్‌లో ఉంచి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..