UP election result 2022: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని ఖాయం చేసుకుంది. ఫలితాల సరళి వెలువడుతున్న కొద్దీ కాషాయ పార్టీ శ్రేణుల్లో సంతోషం పెరిగిపోతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటి మరీ ఎక్కువ స్థానాల్లో విజయం వైపు దూసుకుపోతోంది. ఈ పరిణామాలు భారతీయ జనతాపార్టీలో హుషారు పెంచుతున్నాయి. కమలం మరోసారి వికసిస్తుందన్న సంకేతాలతో యూపీలోనే కాదు.. దేశమంతటా ఆపార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
యూపీలో బీజేపీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో ముందంజలో ఉండటమే కాదు.. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా గోరఖ్‌పూర్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.మొత్తానికి యోగీ ఆదిత్యనాథ్ మరోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోబోతున్నారు. యూపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతున్నారు.
ఆ ట్రెండ్‌కు చెక్..
యూపీ చరిత్రను పరిశీలిస్తే బీజేపీ పాత ఆనవాయితీకి చెక్ పెట్టబోతోంది. 1985 తర్వాత చూస్తే.. వరుసగా ఏ పార్టీ రెండోసారి అధికారం చేజిక్కించుకోలేదు. ఐదేళ్లకోసారి అధికార పగ్గాలు మారుతూ వస్తున్నాయి. పార్టీగా బీజేపీ, ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్ ఆ రికార్డు బద్దలు కొట్టబోతున్నారు. ఇక, 15 సంవత్సరాల తర్వాత ఓ ఎమ్మెల్యే నేరుగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొంది సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా..
2007 నుంచి ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ రాజకీయాలు చూస్తే.. 2007లో మాయావతి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2012లో అఖిలేష్ యాదవ్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. ఆ తర్వాత 2017లో యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యోగీ సీఎం పీఠాన్ని అధిష్టించే ముందు వరకు ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత శాసనమండలి నుంచి ఎన్నికయ్యారు. ఇప్పుడు గోరఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. విజయం సాధించబోతున్నారు. అంటే, 2007 తర్వాత యూపీ అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాబోతున్నారన్నమాట.
ఇక, మరో విషయంలోనూ యోగీ ఆదిత్యనాథ్ చరిత్ర సృష్టించబోతున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో నోయిడాకు వెళ్లిన వాళ్లెవరూ మళ్లీ అధికారంలోకి రాలేదు. అధికారిక రికార్డులు ఈ విషయాన్ని ప్రస్ఫుటిస్తున్నాయి. ఈ మూఢనమ్మకాన్ని ఇంతకుముందు సీఎంలుగా పనిచేసిన వాళ్లు బలంగా నమ్మారు. అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్నసమయంలో ఒక్కసారి కూడా నోయిడాకు వెళ్లలేదంటే ఆ భయం ఎంతగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ములాయం సింగ్ యాదవ్, ఎన్‌డీ తివారి, కల్యాణ్ సింగ్, రాజ్‌నాథ్ సింగ్ వంటి నేతలు కూడా నోయిడా వైపు వెళ్లలేదు. ఈ అపోహను పటాపంచలు చేయాలన్న ఉద్దేశ్యంతో మాయావతి 2007 నుంచి 2012 మధ్య రెండు సార్లు నోయిడా వెళ్లారు. ఆ భయానికి ఫుల్‌స్టాప్ పెడతానన్నారు. కానీ, 2012లో జరిగిన ఎన్నికల్లో మాయావతి అధికారాన్ని కోల్పోయారు. ఇక, ఇప్పుడు యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా పలుమార్లు నోయిడాను సందర్శించారు. మాయావతి బద్దలు కొట్టాలనుకున్న అపోహను ఇప్పుడు యోగీ ఆదిత్యనాథ్ పటాపంచలు చేయబోతున్నారు.
Also read: Punjab Election Result 2022: పంజాబ్‌లో అద్భుతం.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతున్న ఆప్!!
Also read: Magic Figure: మేజిక్ ఫిగర్ అంటే ఏంటి, ఐదు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మేజిక్ ఫిగర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
UP election result 2022: యూపీలో బీజేపీకే మళ్లీ పట్టం.. చరిత్ర సృష్టించబోతున్న యోగీ!
యూపీలో మళ్లీ అధికారం దిశగా బీజేపీ
వరుసగా రెండో సారి ముఖ్యమంత్రిగా యోగీ!
రెండు రికార్డులు బద్దలు కొట్టనున్న సీఎం