Sadananda Gowda: ఆసుపత్రిలో చేరిన కేంద్ర మంత్రి సదానంద గౌడ

Sadananda Gowda Hospitalised:  కేంద్ర మంత్రి డీవీ సదానంద గౌడ అకస్మాత్తుగా అస్వస్థతకు లోనయ్యారు. రక్తంలో చక్కెర స్థాయి పడిపోవడంతో సదానంద గౌడ ఒక్కసారిగా  కుప్పకూలిపోయారు. శివమొగ్గ నుండి బెంగళూరుకు వెళ్తుండగా ఆదివారం నాడు ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.

Last Updated : Jan 3, 2021, 07:35 PM IST
  • అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు లోనైన కేంద్ర మంత్రి సదానంద గౌడ
  • బీజేపీ సమావేశం తర్వాత ప్రయాణిస్తుండగా కేంద్ర మంత్రికి అస్వస్థత
  • మెరుగైన చికిత్సకు బెంగళూరు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన బీజేపీ నేత
Sadananda Gowda: ఆసుపత్రిలో చేరిన కేంద్ర మంత్రి సదానంద గౌడ

Sadananda Gowda Hospitalised:  కేంద్ర మంత్రి డీవీ సదానంద గౌడ(67) అకస్మాత్తుగా అస్వస్థతకు లోనయ్యారు. రక్తంలో చక్కెర స్థాయి పడిపోవడంతో సదానంద గౌడ ఒక్కసారిగా  కుప్పకూలిపోయారు. శివమొగ్గ నుండి బెంగళూరుకు వెళ్తుండగా మార్గం మధ్యలో చిత్రదుర్గక సమీపంలో ఆదివారం నాడు ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారిక వర్గాల సమాచారం.

కేంద్ర మంత్రి సదానంద గౌడ(Sadananda Gowda) ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉందని, ఆసుపత్రిలో టెస్టులు నిర్వహించిన తర్వాత ఆరోగ్య ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. చిత్రదుర్గలో బసవేశ్వర మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చిన ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఓ ప్రేవేట్ ఆసుపత్రిలో చేర్చారు. 

Also Read: ​LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!

వీవీఐపీ కనుక జీరో ట్రాఫిక్ ఆంక్షలతో ఆయనను మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. బీజేపీ(BJP) సమావేశం అనంతరం బెంగళూరుకు వెళ్తుండా మంత్రి సందానంద గౌడ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.

Gallery: Anchor Anasuya Photos: పింక్ డ్రెస్సులో యాంకర్ అనసూయ గుబాళింపు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News