Y Category Security: దేశానికి వ్యాక్సిన్ అందించిన కంపెనీ అధినేతకు కేంద్ర హోంశాఖ వై కేటగరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ కొరత నేపధ్యంలో కంపెనీపై ఒత్తిడి నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
దేశంలో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి సీరమ్ ఇనిస్టిట్యూట్(Serum Institute)ఉత్పత్తి చేస్తున్నకోవిషీల్డ్(Covishield). దేశంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో సింహభాగం కోవిషీల్డ్ వ్యాక్సిన్‌దే. ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ కంపెనీ సీఈవో అదార్ పూణావాలా(Adar Poonawalla) గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రతి విషయాన్ని ట్వీట్ ద్వారా బహిర్గతం చేస్తుంటారు. వ్యాక్సిన్ విక్రయాల్లో కంపెనీ మూడు రకాల ధరల్ని నిర్ణయించడం, కావల్సినంత వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో కంపెనీపై ఇటీవలి కాలంలో ఒత్తిడి ఎక్కువైంది.
ఈ నేపధ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కంపెనీ సీఈవో అదార్ పూణావాలాకు వై కేటగరీ భద్రత(Y Category Security) కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ( Union Home Ministry)నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఈ నిర్ణయం తీసుకోడానికి కాస్సేపటి క్రితమే అదార్ పూణావాలా..కోవిషీల్డ్ వ్యాక్సిన్(Covishield vaccie) రాష్ట్రాలకిచ్చే ధరను వంద రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఎందుకంటే కేంద్రానికి, రాష్ట్రానికి, ప్రైవేటుకు ఇచ్చే ధరల్లో వ్యత్యాసముండటంతో సహజంగానే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక్కొక్క డోసును రాష్ట్రాలకు 4 వందల రూపాయలకు బదులు 3 వందల రూపాయలకు విక్రయించనున్నట్టు ఆయన చెప్పారు.
Also read: Covishield new price: కోవిషీల్డ్ కొత్త ధర, రాష్ట్రాలకు ఇచ్చే ధరను తగ్గించిన సీరమ్ ఇనిస్టిట్యూట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook