Union Budget 2025: ఎన్‌పీఎస్‌లో మార్పులు, బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు మినహాయింపు

Union Budget 2025: మరి కొద్దిరోజుల్లో కేంద్ర బడ్జెట్ రానుంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సేవింగ్ పధకాలపై ప్రత్యేక ప్రకటన ఉండవచ్చని అంచనా ఉంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 23, 2025, 07:27 PM IST
Union Budget 2025: ఎన్‌పీఎస్‌లో మార్పులు, బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు మినహాయింపు

Union Budget 2025: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో ఎలాంటి మినహాయింపులు, ప్రకటనలు ఉంటాయోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్లకు చాలా అంచనాలున్నాయి. ట్యాక్స్ మినహాయింపుల కోసం చూస్తున్నారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు, మినహాయింపులు ఉండవచ్చు. 

వివిధ రకాల సేవింగ్ పథకాలపై ప్రజల్లో ఆసక్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం కన్పిస్తోంది. ప్రజల్లో పొదుపుపై అవగాహన పెంచడం ద్వారా మరింత మంది ఇన్వెస్ట్ చేసేందుకు దోహదమౌతుంది. అందుకే ఎన్‌పీఎస్ పథకంపై ప్రకటనకు అవకాశముందని భావిస్తున్నారు. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసేలా ప్రజల్ని ప్రోత్సహించేందుకు ఈసారి బడ్జెట్‌లో కీలక ప్రకటన చేయవచ్చని అంచనా. వాస్తవానికి 200లో ప్రభుత్వ ఉద్యోగులకై ప్రారంభించిన ఈ స్కీమ్ ఆ తరువాత సామాన్యులకు కూడా విస్తరించింది. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఇది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇప్పుడీ స్కీమ్‌లో ట్యాక్స్ మినహాయింపు పెంచవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎందుకంటే ట్యాక్స్ మినహాయింపు పెంచితే ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య పెరగవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసినాళ్లు ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ ప్రకారం అధిక ప్రయోజనాలు పొందుతున్నారు. సెక్షన్ 80 సి ప్రకారం 50 వేల వరకూ ట్యాక్స్ మినహాయింపు ఉంది.

ఎన్‌పీఎస్‌లో ఈ మార్పులకు అవకాశం

ఎన్‌పీఎస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఈ బడ్జెట్‌లో ట్యాక్స్ మినహాయింపు పరిధి పెంచవచ్చని అంచనా. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్‌లో ఉన్న 50 వేల ట్యాక్స్ మినహాయింపును కొత్త ట్యాక్స్ విధానానికి కూడా పొడిగించవచ్చు. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ అనుసరించే ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కంపెనీ ఇచ్చే సహకార పరిమితి 14 శాతానికి పెంచవచ్చు. సెక్షన్ 80సి ప్రకారం వేతన జీవులు బేసిక్ శాలరీ నుంచి 10 శాతం వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఏడాదికి గరిష్టంగా 1.5 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. 

Also read: Los Angeles Wild Fire: ఆగని లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు, 2 గంటల్లో 8 వేల ఎకరాలు ఆహుతి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News