South Africa Strain: మొన్న కరోనా వైరస్..నిన్న బ్రిటన్ కరోనా స్ట్రెయిన్..ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కరోనా స్ట్రెయిన్ కలకం రేపుతోంది. కర్ణాటకలో ఇద్దరికి సౌతాఫ్రికా స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆందోళన ప్రారంభమైంది.
కరోనా వైరస్ (Corona virus) తరువాత ప్రపంచాన్ని యూకే కరోనా స్ట్రెయిన్ కలకలం రేపింది. ఇప్పుడు కొత్తగా సౌతాఫ్రికా స్ట్రెయిన్ ఆందోళన కల్గిస్తోంది. ఇండియాలో సౌతాఫ్రికా స్ట్రెయిన్ ప్రవేశించలేదనుకుని ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగానికి షాక్ తగిలింది. కర్ణాటక( Karnataka)లో సౌతాఫ్రికా స్ట్రెయిన్(South Africa strain)కేసులు రెండు వెలుగు చూడటంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో సౌతాఫ్రికా స్ట్రెయిన్ ప్రవేశించిందనే వార్త ఆందోళన కల్గిస్తోంది.
ఈ నెల 17 వ తేదీన దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న అన్నాచెల్లెళ్లకు ఎయిర్ పోర్ట్ ( Bengaluru Airport) లో వైద్య పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా తేలింది. అక్కడి నుంచి బళ్లారికు చేరుకున్న ఇద్దరికీ మూడ్రోజుల తరువాత జ్వరంగా ఉండటంతో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి రక్తనమూనాల్ని బెంగళూరు నిమ్‌హాన్స్ ఆసుపత్రికి పంపించారు. ఆ పరీక్షల్లో ఇద్దరికీ సౌతాఫ్రికా స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణైంది. బళ్లారిలోని ట్రామాకేర్ సెంటర్‌లో చికిత్స అందించి హోం క్వారెంటైన్‌లో ఉంచారు.
అదే సమయంలో శివమొగ్గకు చెందిన ఓ వ్యక్తి కూడా దుబాయ్ నుంచి వచ్చాడు. అయితే ఆ వ్యక్తికి సౌతాఫ్రికా స్ట్రెయిన్(South africa strain)లేదని వైద్యులతో పాటు మంత్రి కేఎస్ ఈశ్వరప్ప తెలిపారు. వైద్య పరీక్షల్లో కూడా నెగెటివ్‌గా తేలినట్టు చెప్పారు. బళ్లారికి చేరుకున్న ఇద్దరికి మాత్రం సౌతాఫ్రికా స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణైంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల్నించి వచ్చేవారికి విధిగా పరీక్షలు నిర్వహిస్తోంది.
Also read: Election commissioner: ఎన్నికల కమీషనర్లుగా ఎవరిని నియమించాలి, కీలకంగా మారిన సుప్రీంకోర్టు ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook