Joginapally Santosh Kumar: జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు అరుదైన గౌరవం

Green India Challenge gets honoured: తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, ప్రకృతి ప్రేమికులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.

Written by - Saptagiri | Last Updated : Jun 30, 2022, 05:57 PM IST
  • దేశంలోని అత్యుత్తమ సామాజిక సేవకులకు ఈ అవార్డు
  • జోగినపల్లికి అరుదైన గౌరవం ఎలా దక్కిందంటే..
  • అత్యంత ఆర్భాటంగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవం
Joginapally Santosh Kumar: జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు అరుదైన గౌరవం

Green India Challenge gets honoured: తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, ప్రకృతి ప్రేమికులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.  ఆయనను “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు” వరించింది. పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క 111వ జన్మదినం సందర్భంగా అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. బెంగళూరు వసంత్ నగర్‌లోని డాక్టర్‌ బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో  “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు” ను “వృక్షమాత పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క” చేతుల మీదుగా జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు అందజేశారు.

2020 సంవత్సరానికి గానూ.. దేశంలోని అత్యుత్తమ సామాజిక సేవకులకు  “సాలుమారద తిమ్మక్క ఇంటర్ నేషనల్ ఫౌండేషన్”తో పాటు.. కర్నాటకకు చెందిన  “శ్రీ సిద్ధార్ధ ఎడ్యుకేషనల్ సొసైటి” సంయుక్తంగా అందించిన ఈ అవార్డుల ఉత్సవంలో ప్రకృతి పరిరక్షణ విభాగంలో జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు ఈ అవార్డు అందజేశారు. 

ఈ సందర్భంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ప్రసంగిస్తూ.. దేశంలో అత్యుత్తమ ప్రకృతి సేవకురాలు, ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలోని కమిటీ తనను ఇంతటి అద్భుతమైన “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు”కు ఎంపిక చేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నడిచిన బాటలో అడుగులో అడుగేస్తూ.. తన వంతుగా ఏదైనా చేయాలనే సంకల్పంతో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అనే కార్యక్రమాన్ని సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రారంభించానన్నారు. ఎవరైనా ఒకరు ఓ చిన్న మొక్క నాటి.. ఆ తర్వాత తన స్నేహితుడినో, కుటుంబసభ్యులనో మొక్కలు నాటేలా ప్రోత్సహించాలనే చిన్న ప్రయత్నంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టామని, ఈ కార్యక్రమం నేడు ఖండాంతరాలు దాటిందని, అది తన ఘనతగా భావించడం లేదన్నారు. భవిష్యత్ తరాలకు ఈ నేల అందకుండా పోతుందేమోనన్న ఆందోళనతో తన ఆలోచనకు అనుగుణంగా స్పందిస్తున్న ప్రతీ హృదయానికి, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో మొక్కలు నాటిన వాళ్లందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నానని సంతోష్‌కుమార్‌ తెలిపారు.

Green India Challenge, TRS, Plants, Trees, Salumarada Thimmakka Foundation, Joginaplli Santosh Kumar, Salumarada Thimmakka National green award, TRS MP Santosh Kumar, Green India Challenge gets honoured

ఈ ప్రతిష్టాత్మక అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు జోగినపల్లి సంతోష్‌కుమార్‌. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను మరింత విస్తృతంగా ముందుకు తీసుకుపోవడానికి అవసరమైన శక్తిని అందించిందని చెప్పారు. ఈ వర్షాకాలంలో ప్రతీ ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని సంతోష్‌కుమార్‌ (Joginapally Santosh Kumar) పిలుపునిచ్చారు. అత్యంత ఆర్భాటంగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కర్నాటక మాజీ ఉపముఖ్యమంత్రి గంగాధరయ్య పరమేశ్వర, సిద్ధార్థమఠం పీఠాధిపతి హొరనహళ్లి శ్రీశ్రీ సద్గురు శంకరానంద మహాస్వామితోపాటు.. పలువురు పీఠాధిపతులు, సాలుమారద తిమ్మక్క ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Also read : TSTET 2022 Results: తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలు రేపే విడుదల

Also read : Jobs for 10th Pass: పదో తరగతి పాస్ అయ్యారా?.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అర్హులే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News