US lifted Travel restrictions on India: అగ్రరాజ్యం అమెరికా అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షల ఎత్తివేత నేటి నుంచి (అక్టోబర్ 8 సోమవారం) అమలులోకి వచ్చింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు (USA on Lifting Travel restricetions) అమెరికా తెలిపింది.
భారత్ నుంచి అమెరికాకు ప్రయాణాలు పునఃప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అగ్రరాజ్యం గత నెలలోనే అమెరికా ప్రకటించింది. తాజాగా కొత్త నిబంధనలతో ప్రయాణాలకు అనుమతిస్తోంది అమెరికా.
దీనితో సోమవారం నుంచి భారత్-అమెరికా మధ్య విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. నిన్నటి వరకు అమెరికా ప్రయాణ ఆంక్షల కారణంగా భారత్‌లో చిక్కుకున్న ప్రవాసులు తిరుగు ప్రయాణమవుతున్నారు. అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆంక్షల నేపథ్యంలో భారత్‌లో చిక్కుకున్న వేలాది మంది ఎయిర్‌పోర్ట్‌లకు తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగం చేస్తూ.. భారత్‌లో చిక్కుకున్న వారు.. మొదటి విమానంలోనే అమెరికాకు వెళ్లేందుకు ఆసక్తి చూపారు.
Also read: Five years to the demonetisation: పెద్ద నోట్ల రద్దుకు నేటితో ఐదేళ్లు- కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు
ఆక్షల ఎత్తివేతపై బైడెన్ ఏమన్నారంటే..
‘'అమెరికా ప్రయోజనాల దృష్ట్యా కొవిడ్ సమయంలో విధించిన ఆంక్షల్ని తొలగిస్తున్నాం. టీకా ఆధారిత అంతర్జాతీయ విమాన ప్రయాణాల పునరుద్ధరణకు (Biden on Travel Ban lifting) ప్రాధాన్యం ఇస్తున్నాం'’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(US President Joe Biden) గత నెల వెల్లడించారు. వ్యాక్సినేషన్(Vaccination) రేటు 10 శాతం కంటే తక్కువగా ఉన్న సుమారు 50 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆంక్షల నుంచి వెసులుబాటు కల్పించింది. వారు అమెరికాకు వచ్చిన 60 రోజుల్లోపు టీకా పొందాల్సి ఉందని చెప్పింది.
Also read: Delhi Air Pollution Today: ఢిల్లీలో మరింతగా పెరిగిన వాయు కాలుష్యం.. ప్రమాదకర స్థాయికి సూచీ
Also read: Chennai Floods Pics: చెన్నైను ముంచెత్తిన వరద దృశ్యాలు, అంతా జలమయం
కరోనా కారణంగా ఆంక్షలు..
కరోనా వ్యాపించే ప్రమాదమున్న నేపథ్యంలో అమెరికా కొంత కాలంగా అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. భారత్‌తో పాటు.. చైనా, యూరప్ వంటి దేశాలు సహా.. కెనడా, మెక్సికోలపై కూడా ఆంక్షలు విధించింది. అయితే కరోనా తగ్గుముఖం పడుతుండటం, వ్యాక్సినేషన్ వేగంగా సాగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం ఆంక్షలు ఎత్తేసినట్లు తెలుస్తోంది.
ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసినప్పటికీ అమెరికా వచ్చే వారికి కీలక నిబంధలు పెట్టింది.
Also read: Zika Virus: యూపీలో 'జికా' కల్లోలం..89కి చేరిన కేసులు
అమెరికా ప్రయాణికులకు రూల్స్ ఇవే..
విదేశీ పౌరులు ఎవరైతే అమెరికాకు ప్రయాణించాలనుకుంటున్నారో (New Rules to Travel USA) వారంతా.. 72 గంటల్లోపు కొవిడ్ టెస్ట్ చేయించుకుని ఉండాలి. అందులో నెగెటివ్‌గా తేలితేనే ప్రయాణానికి అనుమతి ఉంటుంది. అయితే అమెరికా సరహద్దు దేశాలైన మెక్సికో, కెనడాల నుంచి రోడ్డు, జల మార్గాల ద్వారా వచ్చే వారికి ఈ టెస్ట్ అవసరం లేదు.
ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి, 18 ఏళ్ల లోపు పిల్లలకూ వ్యాక్సినేషన్ నుంచి మినహాయింపు ఇచ్చింది అమెరికా.
ప్రయాణికుల కొవిడ్ రిపోర్ట్లు ధృవీకరించాల్సిన బాధ్యత విమాన సంస్థలదే. ఈ నిబంధనలను పాటించని సంస్థలకు భారీ జరిమానా విధించనున్నట్లు అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది.
Also read: PM Modi: ప్రపంచంలోనే పాపులారిటీలో నెంబర్ వన్‌గా మోదీ..తర్వాత స్థానాల్లో ఎవరెవరు ఉన్నారంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook