గడిచిన ఆగస్టు నెలలో మొత్తం రూ.93,960 కోట్లు జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్)కింద వసూలైనట్టు తెలుస్తోంది. అవును వస్తు, సేవల పన్ను కింద వసూలైన ఆదాయం అక్షరాల రూ. 93,960 కోట్లు. అందులో సెంట్రల్ జీఎస్టీ రూ. 15,303 కోట్లు కాగా స్టేట్ జీఎస్టీ రూ.21,154 కోట్లు, ఏకీకృత వస్తు సేవల పన్ను (ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ) కింద వసూలైన మొత్తం రూ.49,876 కోట్లుగా ఉంది. ఏకీకృత వస్తు సేవల పన్ను మొత్తంలో రూ.26,512 కోట్లు దిగుమతులపై వసూలైనట్టు ఏఎన్ఐ పేర్కొంది. మరో రూ.7,628 కోట్లు సెస్ కింద వసూలు కాగా అందులోనూ రూ.849 కోట్లు దిగుమతులపై వచ్చిన ఆదాయంగా ఏఎన్ఐ వివరించింది. ఈ మేరకు ఏఎన్ఐ ఓ ట్వీట్ చేసింది.
అయితే, ఈ సమాచారం ఎవరు, ఎక్కడ, ఎప్పుడు వెల్లడించారనే వివరాలను మాత్రం సదరు న్యూస్ ఏజెన్సీ స్పష్టంచేయలేదు.