Mamata Banerjee Suffers With Major Injury: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీవ్ర గాయమైంది. రక్తస్రావంతో ఆమె ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అసలు ఏం జరిగింది? ఏమిటి అనేది ఇంకా తెలియలేదు. ఆమె వెంటనే కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. కోల్‌కత్తాలోని ప్రభుత్వ ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
Also Read: Sudha Murty Oath: సుధామూర్తికి ప్రత్యేక గౌరవం.. ఎట్టకేలకు రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం
తల నుదుటిపై ఒక గాయం కావడం.. దాని నుంచి ముక్కు, చెంపలపై రక్తం కారుతూ కనిపిస్తోంది. గాయంతో ఆమె ఆస్పత్రిపై బెడ్‌పై ఉన్న ఫొటోలు తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసింది. 'ఆమెకోసం అందరూ ప్రార్థనలు చేయండి' అని పోస్టు చేసింది. ఆమె గాయం వార్త తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు పార్టీలకతీతంగా స్పందిస్తున్నారు. వీలైనంత త్వరగా కోలుకోవాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షు సుకాంత మజుందార్ కోరుకున్నారు.
Also Read:OTT Ban: అశ్లీల కంటెంట్ ప్రియులకు కేంద్రం భారీ షాక్.. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు రద్దు
కాగా, లోక్‌సభ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న సమయంలో పార్టీ అధినేత్రి మమతకు గాయం కావడం కలచివేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు మమతా బెనర్జీ భారీ వ్యూహం రచించుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇండియా కూటమిలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి మమత ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు. రేపో, ఎల్లుండో ఎన్నికల ప్రకటన వెలువడుతున్న నేపథ్యంలో మమత గాయపడడం తృణమూల్ పార్టీకి భారీ దెబ్బగా చెప్పవచ్చు. అయితే గాయం ఎలా తగిలింది? ఆమె ఎప్పుడు కోలుకుంటారో అనే విషయాలు తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter