CIBIL Score: సిబిల్ స్కోర్ ఎలా తగ్గుతుందో తెలుసా ? ఈ విషయాలు తెలుసుకోండి!

మీకు క్రెడిట్ కార్డు లేదా ఏదైనా లోన్ తీసుకోవాలి అనుకుంటే ముందుగా మీ సిబల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ ను చెక్ చేస్తారు.

Last Updated : Sep 27, 2020, 03:41 PM IST
    • మీకు క్రెడిట్ కార్డు లేదా ఏదైనా లోన్ తీసుకోవాలి అనుకుంటే ముందుగా మీ సిబల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ ను చెక్ చేస్తారు.
    • మీ సిబిల్ ఎంత బాగుంటే మీకు లోన్ దొరికే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.
    • అయితే క్రెడిట్ స్కోర్ ఎలా నిర్ణయిస్తారు.. మీ క్రెడిట్ స్కోర్ ను ప్రభావితం చేసే అంశాలేంటి అని మీకు డౌట్ రావచ్చు.
CIBIL Score: సిబిల్ స్కోర్ ఎలా తగ్గుతుందో తెలుసా ? ఈ విషయాలు తెలుసుకోండి!

మీకు క్రెడిట్ కార్డు లేదా ఏదైనా లోన్ తీసుకోవాలి అనుకుంటే ముందుగా మీ సిబల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ ను చెక్ చేస్తారు. మీ సిబిల్ ఎంత బాగుంటే మీకు లోన్ దొరికే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. అయితే క్రెడిట్ స్కోర్ ఎలా నిర్ణయిస్తారు.. మీ క్రెడిట్ స్కోర్ ను ప్రభావితం చేసే అంశాలేంటి అని మీకు డౌట్ రావచ్చు. చాలా మంది తమ ఈఎమ్ ఐ ( EMI ) లేదా క్రెడిట్ కార్డు పేమెంట్స్ ( Credit Card ) టైమ్ కు చెల్లించకపోవడం వల్లే సిబిల్ స్కోర్ తగ్గుతుంది అని చాలా మంది అనుకుంటారు. కొంత మంది లేట్ ఫీజ్ తరువాత పేమెంట్ ను పూర్తి చేసే అంతా సర్దుకుంటుంది అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు. ఆలస్య రుసుము వల్ల మీ జేబుకే చిల్లు పడుతుంది. దాంతో పాటు మీ క్రెడిట్ స్కోర్ కూడా తగ్గుతుంది. అందుకే గడువులోపే పేమెంట్ చేయాలి.

ALSO READ| Online Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి

సిబిల్ ను ప్రభావితం చేసే అంశాలివే..
మీరు క్రెడిట్ కార్డు పేమెంట్ చేయడంలో ఆలస్యం చేస్తే అందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎన్నో బ్యాంకులు 30 రోజుల లేట్ చెల్లింపులను సిబిల్ కు ( CIBIL) రిపోర్ట్ చేయవు. అంటే ఒక నెలకు సంబంధించి వడ్డీ, లేట్ పేమెంట్ ఫీజును మీరు చెల్లిస్తే సరిపోతుంది. దాని వల్ల మీ క్రెడిట్ స్కోర్ ఏ మాత్రం ప్రభావితం కాదు. అయితే దీనికన్నా ఎక్కువ లేట్ అయితే మాత్రం మీ సిబల్ స్కోర్ పై దాని ప్రభావం కనిపిస్తుంది. 

30 రోజుల తరువాత..
మీరు 30 నుంచి 60 రోజుల మధ్యలో పేమెంట్స్ చేస్తే మీ రిపోర్టును సిబిల్ కు పంపిస్తారు. అయితే పేమెంట్ చేసిన వెంటనే మీ స్కోర్ మళ్లీ మెరుగుఅవుతుంది. అయితే  తరచూ ఇలాగే ఆలస్యంగా పేమెంట్ చేస్తే మాత్రం క్రెడిట్ స్కోర్ పై నెగెటీవ్ ఎఫెక్ట్ పడుతుంది.

  • పేమెంట్ 90 రోజుల కన్నా లేట్ అయితే  మీ క్రెడిట్ స్కోర్ 7 సంవత్సరాల వరకు ప్రభావితం అవుతుంది. మిమ్మల్ని రిపీట్ అఫెండర్ గా ( Repeat Offender ) పరిగణిస్తారు.
  • తరువాత థర్ట్ పార్టీ కలెక్షన్ ఏజెంట్స్ ను డబ్బు కలెక్ట్ చేసుకోవడానికి పంపిస్తారు. దీని గురించి సిబిల్ కు కూడా సమాచారం అందిస్తారు. దీంతో మీ సిబిల్ స్కోర్ మరింతగా తగ్గుతుంది.

ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి

క్రెడిట్ కార్డ్ డీఫాల్ట్ నుంచి సేవ్ అవండి
మీరు మీ ఆదాయం, ఖర్చుల మధ్య మంచి బ్యాలెన్స్ మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. ఒక వేల మీకు ఒక నెల ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండి మొత్తం క్రెడిట్ కార్డు పేమెంట్స్ చేయలేకపోతే మాత్రం మినిమం పేమెంట్ తప్పకుండా చేయండి. దీంతో మీరు బ్యాలెన్స్ ఎమౌంట్ పై మాత్రమే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. డిఫాల్ట్ లిస్ట్ లో మీ పేరు ఉండదు. ఎంత డబ్బు వచ్చినా వెంటనే క్రెడిట్ కార్డు ఎకౌంట్ లో వేసేయండి. నెల చివరి వరకు వేచి చూడకండి.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News