PM Narendra Modi: ప్రాణాలతో చేరుకోగలిగాను.. మీ సీఎంకు థాంక్స్: ప్రధాని మోదీ

ఆందోళన కారుల కారణంగా తన పర్యటనను రద్దు చేసుకుని భఠిండా ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయిన ప్రధాని మోదీ అక్కడ అధికారులతో మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2022, 09:33 PM IST
  • ప్రాణాలతో చేరుకోగలిగాను
  • మీ సీఎంకు థాంక్స్
  • భద్రతా వైఫల్యంపై ప్రధాని మోదీ అసహనం
PM Narendra Modi: ప్రాణాలతో చేరుకోగలిగాను.. మీ సీఎంకు థాంక్స్: ప్రధాని మోదీ

PM Modi slams Punjab CM over security lapse: పంజాబ్‌ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి నిరసన సెగ తగిలిన విషయం తెలిసిందే. ఫిరోజ్‌పూర్ సభలో ప్రశంగించేందుకు వెళుతున్న ప్రధానిని ఆందోళన కారులు అడ్డుకున్నారు. 20 నిమిషాల పాటు మోదీ కాన్వాయ్‌ను ఫ్లైఓవర్‌పై నుంచి ఆందోళన కారులు కదలనివ్వలేదు. దీంతో ప్రధాని తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని తిరిగి భఠిండా ఎయిర్‌ పోర్టు (Bathinda Airport)కు వెళ్లిపోయారు. ఈ భద్రతా వైఫల్యంపై మోదీ అసహనం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. దీనిపై స్పందించిన పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ (Punjab CM Charanjit Singh Channi).. ప్రధాని భద్రతా చర్యల్లో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు. ఇక ఆందోళన కారుల కారణంగా తన పర్యటనను రద్దు చేసుకుని భఠిండా ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయిన ప్రధాని మోదీ అక్కడ అధికారులతో మాట్లాడుతూ... 'మీ సీఎంకు (పంజాబ్‌ ముఖ్యమంత్రి) చాలా కృతజ్ఞతలు. కనీసం నేను భఠిండా ఎయిర్‌పోర్టుకు ప్రాణాలతో తిరిగి రాగలిగా' అని అన్నారు. ప్రధాని మాటలను బట్టి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విమానాశ్రయ సిబ్బంది అభిప్రాయపడ్డారు.

Also Read: Kartik Aaryan Lady Fans: యువ హీరో ఇంటిముందు లేడీ ఫాన్స్ రచ్చ.. ఏక్ మినట్, ఏక్ మినట్ అంటూ!!

పంజాబ్‌ (Punjab)లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (జనవరి 5) ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఫిరోజ్‌పూర్ కార్యక్రమ వేదికకు వెళ్లాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని ప్రధాని నిర్ణయించుకున్నారు. అయితే మోదీ ప్రయాణిస్తోన్న కాన్వాయ్‌ మార్గంలో ఓ ఫ్లైఓవర్‌ వద్ద ఆందోళనకారులు రహదారిని బ్లాక్‌ చేశారు. దీంతో ప్రధాని కాన్వాయ్‌ 20 నిమిషాల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌ పైనే ఉన్న మోదీ.. తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు.

Also Read: Daughters: అంత్యక్రియలకు కుమారులు దూరం.. తల్లి మృతదేహాన్ని 4 కిలోమీటర్లు మోసిన కుమార్తెలు! కారణం ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News