Tamil nadu politics: తమిళనాడులో సినీ రాజకీయాల ప్రభావం చాలా ఎక్కువ. అన్ని పార్టీల నేపధ్యం సినిమాలే. మరి తమిళుల మరో ఆరాధ్య నటుడు విజయ్ రాజకీయ పార్టీ పరిస్థితి ఏంటి..అతనేమంటున్నాడు..
సినీ నేపధ్యం నుంచి రాజకీయ పార్టీలు స్థాపించిన వ్యవహారాలు తమిళనాడు ( Tamil nadu ) లో చాలా కన్పిస్తాయి. అధికార పార్టీ, ప్రతిపక్షం రెండూ ఆ నేపధ్యం నుంచి వచ్చినవే. ఈ రెండూ కాకుండా మరో 2-3 పార్టీలున్నాయి. ఇప్పుడు మరో రెండు పార్టీలు రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ( Kamal Haasan ) స్థాపించిన పార్టీ ఒకటి..సూపర్ స్టార్ రజినీకాంత్ ( Superstar Rajinikanth ) స్థాపించబోయే పార్టీ మరోవైపు ఉన్నాయి. అయితే గతంలో ఏఐఏడీఎంకే ( AIADMK), డీఎంకే ( DMK ) పార్టీలకు ప్రజలిచ్చిన ఆదరణ ఈ కొత్త పార్టీలకు ఏ మేరకు ఉంటుందనేదే ప్రశ్న. కమల్ హాసన్ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా..రజనీకాంత్ జనవరిలో పార్టీ ప్రకటించబోతున్నారు.
ఈ క్రమంలో మరో నటుడు తమిళుల ఆరాధ్య నటుడు విజయ్ ఏమనుకుంటున్నారనేది ఆసక్తిగా మారింది. తమిళ దళపతి విజయ్ ( Tamil Thalapathy vijay ) రాజకీయ ప్రవేశం చేస్తారనే వార్తలు ఎక్కువగా విన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్..కొడుకుని రాజకీయాల్లోకి రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విజయ్ మక్కల్ ఇయక్కమ్ ను రాజకీయ పార్టీగా మార్చేందుకు ప్రయత్నించి..ఎన్నికల కమీషన్ కు దరఖాస్తు కూడా చేశారు. అయితే విజయ్ కాదనడంతో వెనక్కి తగ్గారు.
ప్రస్తుతం విజయ్..కమల్ హాసన్, రజనీకాంత్ పార్టీల ప్రభావంపై దృష్టి పెట్టి పరిశీలిస్తున్నారని తెలిసింది. ఆ రెండు పార్టీలపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందనేది తెలుసుకుంటున్నారని సమచాారం. రాష్ట్రంలో తమకు ఉజ్వల భవిష్యత్ ఉందని..తొందరపడవద్దని విజయ్ ( Vijay ) అభిమానులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిమానులతో విజయ్ సమావేశమవుతూనే ఉన్నారు. పరిస్థితులన్నీ అంచనా వేసుకున్న తరువాతే రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకోవాలనేది విజయ్ ఆలోచనగా ఉంది.
Also read: Tamil nadu: తమిళనాట ఎన్నికల వేడి..రజనీకాంత్ మద్దతుతో ముఖ్యమంత్రిగా కమల్ హాసన్ ?