TRS build office in Delhi: న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi ) పార్టీ కార్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు కేంద్రం.. ఆ స్థలానికి సంబంధించిన పత్రాలను అందజేసింది. ఇటీవల రాజధాని న్యూఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ (TRS office) భవన నిర్మాణానికి వసంత్ విహార్ (New Delhi’s Vasant Vihar) లో 1,100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దానికి సంబంధించిన పత్రాలను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి సుమిత్ కుమార్.. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) కి బుధవారం అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన సరిహద్దులను కూడా వివరించారు. Also read : Arnab Goswami Arrest: ప్రతీకారం కాదు, చట్ట ప్రకారమే చేశామన్న సంజయ్ రౌత్
పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం ఢిల్లీలోని వసంత్ విహార్ లో కేటాయించిన స్థలం పత్రాలను కేంద్ర ప్రభుత్వం నుండి అందుకోవడం జరిగింది.ఇంతటి బృహత్తర కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRTRS గారికి ధన్యవాదాలు.. pic.twitter.com/1mGALOD2Y3
— Vemula Prashanth Reddy (@VPRTRS) November 4, 2020
ఈ మేరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కృషి ఫలితంగానే ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు కానుందని తెలిపారు. అయితే ఇలాంటి కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో సరిహద్దులను పరిశీలిస్తూ.. స్థలానికి సంబంధించిన పత్రాలను అందుకుంటున్న ఫొటోలను ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇదిలాఉంటే.. త్వరలోనే సీఎం కే. చంద్రశేఖర్ రావు (CM KCR) ఢిల్లీలో కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.
Also read : Rafale: ఇండియాకు చేరుకున్న మరో మూడు రఫేల్ యుద్ద విమానాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe