Custodial Death Case: మరో ముగ్గురు పోలీసుల అరెస్ట్

తండ్రీ కొడుకుల ‘పోలీసు కస్టడీ డెత్’ (custodial death case) కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో సీబీ-సీఐడీ అధికారులు మరో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్ రఘు గణేష్‌ను నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Last Updated : Jul 2, 2020, 10:38 AM IST
Custodial Death Case: మరో ముగ్గురు పోలీసుల అరెస్ట్

Tamil Nadu Custodial Death Case |  ట్యూటికొరిన్‌లో జరిగిన తండ్రీ కొడుకుల ‘పోలీసు కస్టడీ డెత్’ (custodial death case) కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో సీబీ-సీఐడీ అధికారులు మరో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్ రఘు గణేష్‌ను నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో సబ్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణన్, కానిస్టేబుల్స్ ముత్తురాజ్, మురుగన్‌లను సీబీ-సీఐడీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. Gold Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసు (Tuticorin Custodial Deaths)లో ఇప్పటివరకూ సీఐడీ అధికారులు మొత్తం నలుగురిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇద్దరి మరణం (Custodial Death Case)పై పోలీసులు చెప్పిన వివరాలను సీసీటీవీ ఫుటేజీతో చెక్ చేసి షాకయ్యారు. అరెస్ట్ చేసే సమయానికి ముందు వారికి ఎలాంటి గాయాలు లేవని సీసీ ఫుటేజీ ద్వారా సీఐడీ అధికారులు గుర్తించారు. పోలీసులు చెప్పింది కట్టుకథ అని తేలిపోయింది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

కాగా, లాక్‌డౌన్‌లో నిర్ణీత సమయంలో మొబైల్ షాపు (ఏపీజే మొబైల్స్) మూయలేదన్న కారణంగా జయరాజ్ (58)ను జూన్ 19నరాత్రి స్టేషన్‌కు తీసుకెళ్లి కుమారుడు బెనిక్స్ (31)ని పీఎస్‌కు రావాలని చెప్పి విచారణ చేపట్టినట్లు ట్యూటికొరిన్ పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసు కస్టడీలో తండ్రి, కొడుకును పోలీసులు తీవ్రంగా హింసించారని, శరీర అవయవాలు దెబ్బతినేలా లాఠీలతో వారిని చితకబాదారన్న ఆరోపణలున్నాయి. Bank Holidays: జులైలో బ్యాంకు సెలవులు ఇవే..

నిర్దేశిత సమయంలో సెల్‌ఫోన్ షాపు మూయలేదని, తమకు కావలసిన మొబైల్స్ ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేయడంతో తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ వాగ్వివాదానికి దిగినట్లు తెలుస్తోంది. అరెస్టయిన వీరిని విడిచిపెట్టగా కోవిల్ పట్టి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇద్దరి చావుకు కారణమైన వారిపై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని జయరాజ్ కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్ అయ్యారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!

Trending News