Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వెదర్ అలర్ట్..రాగల మూడు రోజులపాటు వానలే..!

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన కొనసాగుతోంది. తాజా వెదర్ రిపోర్ట్‌ను ఇప్పుడు చూద్దాం..

Written by - Alla Swamy | Last Updated : Jul 24, 2022, 03:36 PM IST
  • తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
  • మరోమారు భారీ వర్ష సూచన
  • కీలక సూచనలు జారీ చేసిన ఐఎండీ
 Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వెదర్ అలర్ట్..రాగల మూడు రోజులపాటు వానలే..!

Weather Alert: తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తనం ప్రభావం అధికంగా ఉంది. నిన్న ఉత్తర ఇంటీరియర్ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం..ఇవాళ ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. నిన్నటి ఉత్తర-దక్షిణ ద్రోణి ఇవాళ బలహీనపడింది.

వీటి ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా రాగల మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో  భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడురోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈమేరకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ లెటెస్ట్ వెదర్ రిపోర్ట్‌ను వెల్లడించింది.

మరోవైపు ఏపీలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు పడ్డాయి. చాలా చోట్ల అధిక వర్షపాతం నమోదు అయ్యింది. కోస్తాంధ్ర తీరం వెంట పెను గాలులు వీస్తున్నాయి. ఇటు తెలంగాణలో రానున్న మూడురోజులపాటు అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో వెదర్ అలర్ట్ జారీ చేశారు.

ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. దీంతో ఆయా జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు.

Also read:Monkeypox: దేశంలో మంకీపాక్స్ టెర్రర్..తాజాగా వెలుగులోకి కొత్త కేసు..!

Also read:Lal Darwaza Bonalu LIVE* Updates: అంగరంగ వైభవంగా లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాలు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News