Rain Alert: ఒడిశా పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం కొనసాగుతూనే ఉంది. అల్ప పీడనానికి ఉపరితల ఆవర్తనం తోడు అయ్యింది. సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది. వీటి ప్రభావంతో తెలంగాణలో రాగల మూడురోజులు పాటు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ వెదర్ రిపోర్ట్‌ను వెల్లడించింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం ఉండటంతో కోస్తాంధ్రలో కుండపోత వర్షాలు పడుతున్నాయి.
తీరం వెంట పెను గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ, అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించాయి. రాయలసీమలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడురోజులుగా ముసురు పట్టుకుంది. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు దుక్కి దున్నే పనిలో ఉన్నారు. మరోవైపు రాష్ట్ర విపత్తు సంస్థ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశారు.
A Well Marked Low Pressure Area lies over Northeast Arabian Sea & adjoining coastal areas of Saurashtra & Kutch. The associated cyclonic circulation extends upto upper tropospheric levels. It is likely to move westwards and concentrate into a Depression during the next 24 hrs. pic.twitter.com/LSAEBhAdcl
— India Meteorological Department (@Indiametdept) July 15, 2022
Also read:Hyderabad Traffic: ఎల్లుండి సికింద్రాబాద్‌లో బోనాల జాతర..ట్రాఫిక్ మళ్లింపులు ఇవే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook