Supreme court says it may consider interim bail to arvind kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు, రౌస్ అవెన్యూ కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ బైటకు వస్తే, కేసును తారుమారు చేసే అవకాశంద ఉందంటూ ఈడీ వాదించింది. అంతేకాకుండా.. ఈకేసులో ఉన్నవారిని ప్రభావితం చేసే అవకాశం కూడా లేకపోలేదంటూ కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదించింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ టీమ్.. ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా సర్వోన్నత న్యాయస్థానం ముందు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Read more: CV Ananda Bose: ఎన్నికల వేళ బీజేపీకి షాక్.. రాజ్ భవన్ లో గవర్నర్ పాడుపని.. మండిపడిన సీఎం మమత..
ఈ బెయిల్ విచారణ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నేపథ్యంలో.. అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. " ఒక మనిషి జీవితంలో స్వేచ్ఛ చాలా ముఖ్యమైనదంటూకూడా వ్యాఖ్యానించింది." అదే విధంగా.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి తనను అరెస్టు చేసిన సమయానికి సంబంధించి కేజ్రీవాల్ అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వాలని సుప్రీంకోర్టు మంగళవారం దర్యాప్తు సంస్థను కోరిన విషయంతెలిసిందే. ఈక్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసంపైవిధంగా స్పందించి, దీనిపై మరింత విచారణను జరిపేందుకు గాను.. కేసును మే 7వ తారీఖుకు వాయిదావేసింది.
2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల జైలులో కావాలనిస్వీట్లు, మామిడి పండ్లు తింటున్నారని ఈడీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.దీంతో అతని షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఈ కారణాలు చూపెట్టి జైలు నుంచి బైటపడోచ్చని అరవింద్ కేజ్రీవాల్ ప్లాన్ అంటూ ఈడీ కోర్టు ముందు పిటిషన్ దాఖలు చేసింది.
అయితే.. దీనికి కౌంటర్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, లీగల టీమ్ జైలులో.. అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇవ్వడంలేదని,ఆయన ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోవట్లేదని రివర్స్ అటాక్ కు దిగారు. ఆయన సతీమణి కూడా అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఎన్నికల నేపథ్యంలో బెయిల్ ఇవ్వోచ్చన్న వ్యాఖ్యలతో ఆప్ నేతల్లో ప్రస్తుతం ఆనందం నెలకొందని తెలుస్తోంది. ఇది ఆప్ వర్గాల్లో భారీ ఉపశమనం అనికూడా చెప్పుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter