/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Supreme court: భారత సర్వోన్నత న్యాయస్థానం మరో కీలక తీర్పును వెలువరించింది. ఆర్యసమాజ్‌లో జరిగే పెళ్లిళ్లపై సంచలన తీర్పు ఇచ్చింది. ఆర్యసమాజ్‌ల్లో జరిగే పెళ్లిళ్లకు చట్టబద్ధంగా గుర్తించలేమని స్పష్టం చేసింది. ఆ సర్టిఫికెట్లు చెల్లవని తేల్చి చెప్పింది. పెళ్లిళ్లు చేయడం ఆర్య సమాజ్‌ పని కాదని ఈ సందర్బంగా కోర్టు అభిప్రాయపడింది. హిందూ ధర్మాన్ని మూఢ నమ్మకాలకు దూరంగా తీసుకెళ్లే లక్ష్యంతోనే 1875 ఏప్రిల్ 10న దయానంద సరస్వతి ఆర్యసమాజాన్ని స్థాపించారని గుర్తు చేసింది.

మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమ పెళ్లిపై నమోదు అయిన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తమ కుమార్తెను ఓ యువకుడు కిడ్నాప్‌ చేసి, అత్యాచారానికి ఒడిగట్టాడని మధ్యప్రదేశ్‌లో బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మేజర్ కాదని తెలిపింది. ఫిర్యాదు ఆధారంగా యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆ కేసును సవాల్‌ చేస్తూ ఆ యువకుడు సుప్రీం కోర్టు తలుపు తట్టాడు.

ఆమె మేజరేనని..ఇష్టపూర్వకంగానే ఇంటి నుంచి బయటకు వచ్చిందని..పెళ్లి సైతం చేసుకుందని యువకుడు వివరించాడు. తమ వివాహం ఆర్య సమాజ్‌లో జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఈసందర్భంగా వివాహ ధృవీకరణ పత్రాన్ని కోర్టు ముందుకు ఉంచాడు. దీనిపై జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బి.వి నాగరత్నతో కూడి ధర్మాసనం ..ఆ ధృవీకరణ పత్రాన్ని చెల్లదని తేల్చి చెప్పింది. ఈకేసులో ఇంకా ఏమైనా పత్రాలు ఉంటే తీసుకురావాలని సర్వోన్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది.

Also read:Sidhu Moose Wala Case: సిద్ధూను బిష్ణోయే హత్య చేయించాడా..పోలీసుల వద్ద కీలక చిట్టా..!

Also read: China Earthquake: చైనాలో భారీ భూకంపం..పరుగులు తీసిన జనాలు..వీడియోలు వైరల్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Section: 
English Title: 
supreme court of india rules arya samaj marriage certificate invalid
News Source: 
Home Title: 

Supreme court: ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లు ఇక చెల్లవు..సుప్రీం కోర్టు సంచలన తీర్పు..!

Supreme court: ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లు ఇక చెల్లవు..సుప్రీం కోర్టు సంచలన తీర్పు..!
Caption: 
supreme court of india rules arya samaj marriage certificate invalid(file)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

భారత సర్వోన్నత న్యాయస్థానం మరో కీలక తీర్పు

ఆర్యసమాజ్‌లో జరిగే పెళ్లిళ్లపై సంచలన తీర్పు

ఆ పెళ్లిళ్లకు చట్టబద్ధంగా గుర్తించలేమని స్పష్టం

 

Mobile Title: 
Supreme court: ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లు ఇక చెల్లవు..సుప్రీం కోర్టు సంచలన తీర్ప
Alla Swamy
Publish Later: 
No
Publish At: 
Friday, June 3, 2022 - 17:49
Request Count: 
105
Is Breaking News: 
No