Sri Rama Navami 2024: శ్రీరామ నవమి శోభాయాత్ర.. అల్లాహ్‌.. అనాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ..

Mamatha banerjee: ప్రధాని మోదీ వెస్ట్ బెంగాల్ లోని దినాజ్ పూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మోదీ మాట్లాడుతూ.. ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలను, శోభాయాత్రలను ఎలాంటి అంతరాయంలేకుండా జరుపుకుంటామని అన్నారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Apr 16, 2024, 10:40 PM IST
  • వెస్ట్ బెంగాల్ లో ర్యాలీలో పాల్గొన్న మోదీ..
  • అల్లాహ్ అని ప్రార్థించాలన్న మమతా..
Sri Rama Navami 2024: శ్రీరామ నవమి శోభాయాత్ర.. అల్లాహ్‌.. అనాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ..

West Bengal CM Mamatha Banerjee Fires On Modi: దేశంలో ప్రస్తుతం ఒకవైపు ఎన్నికల హీట్ నడుస్తోంది. ఆయా పార్టీలన్ని ఎన్నికలలో విజయం సాధించేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. జోరుగాప్రచారం నిర్వహిస్తు ప్రజలు దగ్గర మార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఇక దేశంలో రాజకీయాలు ఒకవైపు, బీజేపీ రహిత రాష్ట్రాలలో పాలన మరో విధంగా ఉంటుంది. ఇక బీజేపీ అన్న, ప్రధాని మోదీ అన్న.. వెస్ట్ బెంగాల్ సీఎం ఎప్పుడు చూసి రుసరుసలాడుతుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా మోదీపై మమతా బెనర్జీ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల నేపథ్యంలో ప్రధానిమోదీ దక్షిణ్ దినాజ్‌పూర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రజలనుద్దేషించి ఆయన మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ ఎల్లప్పుడూ రామనవమి ఊరేగింపులను ఆపేందుకు ప్రయత్నించిందని అన్నారు. కానీ ఈ ఏడాది మాత్రంఎలాంటి  అంతరాయం లేకుండా  రామయ్య శోభాయాత్రలను ఎంతో వేడుకగా జరుపుకుంటామని అన్నారు.

Read More: Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు, సీతారామ కళ్యాణం జరిపిస్తారు.. దీని వెనుక ఉన్న ఈ విశేషం మీకు తెలుసా..?

రామ నవమిని ఉత్సవాలను ఆపేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.. ఎన్నో కుట్రలు పన్నినా.. కోర్టు నుంచి అనుమతి పొంది మరీ ఈసారి  భక్తి, విశ్వాసంతో రామనవమి జరుపుకుంటామని కలకత్తాను ఉద్దేశించి ప్రధాని ప్రకటించారు. కలకత్తా హైకోర్టు విశ్వహిందూ పరిషత్,  అంజనీ పుత్ర సేనలను రామనవమి ఊరేగింపులను అనుమతించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. వీరి పిటిషన్ ను విచారించిన ధర్మాసం రామనవమి శోభాయాత్రలకు అనుమతిని ఇచ్చింది.అయితే కొన్ని షరతులలో పాల్గొనేవారిని గరిష్టంగా 200కి పరిమితం చేసింది. అంతేకాకుండా.. ఆయుధాల ప్రదర్శనను చేయోద్దని కోర్టు తెలిపింది. ఒక్కో ర్యాలీకి రాముడి విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనాన్ని మాత్రమే ఉపయోగించవచ్చని కోర్టు పేర్కొంది. రాముడి శోభయాత్రర్యాలీ నిర్వాహకులు - VHP,  పుత్ర సేన వేర్వేరు రోజులలో తమ కార్యక్రమాలను షెడ్యూల్ చేయమని వ్యాఖ్యానిచ్చింది.

రెచ్చగొట్టే నినాదాలు చేయడం లేదా డిస్క్ జాకీలను ఉపయోగించవద్దని హైకోర్టు హెచ్చరించడం జరిగింది. ఇదిలా ఉండగా.. బీజేపీపై, శ్రీరామనవమి శోభయాత్రపై మమతా బెనర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర బెంగాల్‌లోని జల్‌పైగురిలో, Ms బెనర్జీ ఈ కాలంలో "నకిలీ వీడియోలను" వ్యాప్తి చేసినందుకు బీజేపీ నేతలను కొట్టారని, ఎలాంటి కవ్వింపులో చిక్కుకోవద్దని ప్రజలను హెచ్చరించారు. అదేవిధంగా.. "నా మైనారిటీ సోదర సోదరీమణులు.. ఏప్రిల్ 17 న వీరి  నినాదాలు చేయడం చూస్తే, అది వారి అల్లర్లు ప్రారంభించే రోజు.  బీజేపీ వాళ్లు దూషించినా సరే.. అల్లాహ్‌ అని ప్రార్థించండని పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రేరేపణలకు లొంగకుండా.. శాంతి భద్రతలు కాపాడాలన్నారు. అల్లర్లు సృష్టించి ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)కి పంపాలని చూస్తున్నారు. కాబట్టి ఓటింగ్ జరగదని, ఓట్లను రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మమతా అన్నారు.

Read More: Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..

గత ఏడాది రామనవమి ఊరేగింపుల్లో హింసపై బీజేపీ, తృణమూల్ పరస్పరం తీవ్ర స్థాయిలో దాడులు చేసుకున్నాయి. హౌరాలోని షిబ్‌పూర్, హుగ్లీ జిల్లాలోని రిష్రా,  ఉత్తర దింజాపూర్‌లోని దల్‌ఖోలాలో జరిగిన ఘర్షణలపై విచారణ జరిపేందుకు హైకోర్టు అప్పగించిన ఎన్‌ఐఏ 27 మందిని అరెస్టు చేసింది. బీహార్‌తో సహా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. బెంగాల్‌లో శుక్రవారం ప్రారంభమయ్యే 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు దశల్లో ఓటు వేయనున్నారు. ఫలితాలు జూన్ 4న ప్రకటించబడతాయి. 2019 ఎన్నికలలో తృణమూల్ బీజేపీ ఆశ్చర్యకరంగా బలమైన ప్రదర్శనను సాధించింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News