ఆగస్టు 15 ( August 15 )..భారతీయులకు ఓ పండుగ దినం. దేశ స్వాతంత్ర్యదినోత్సవమది ( Independence day celebrations ). ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపధ్యంలో ఎక్కడా వేడుకలు జరిగే పరిస్థితి లేకపోయినా...చేయక తప్పదు. ముఖ్యంగా ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ ( Flag hosting ) . అందుకే ప్రత్యేక పరీక్షలు..ఏర్పాట్లు సాగుతున్నాయి.
కరోనా వైరస్ ( Corona virus ) విజృంభణ నేపధ్యంలో దేశంలో పగడ్బందీ ఆంక్షలు జాగ్రత్తల మధ్య పంద్రాగస్టు వేడుకలు జరగనున్నాయి. ఎక్కడ ఎలా ఉన్నా..దేశ రాజధానిలో ఎర్రకోట ( Red Forte ) సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ ( Prime minister narendra modi ) జెండా ఎగురవేత అత్యంత ప్రాధాన్యత కలిగింది. అందుకే ప్రత్యేక ఏర్పాట్లు, పరీక్షలు చేస్తున్నారు. జెండా ఎగురవేసే సమయంలో ప్రధానికి అత్యంత సమీపంలో ఉండేవారందరికీ ప్రత్యేకంగా కరోనా నిర్ధారణ పరీక్షలు ( Covid19 tests ) చేస్తున్నారిప్పుడు. పంద్రాగస్టు వేడుకకు ప్రధాని మోదీకు అత్యంత సమీపంగా ఓ మహిళా అధికారి ఉండనున్నారు. జెండా ఎగురేసే తాడును ప్రధాని చేతికి అందించేది ఆ మహిళా అధికారినే. అందుకే ముందుగా ఆ మహిళా అధికారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. మరోవైపు ఆ రోజు విధులు నిర్వహించే భద్రతా అధికారులంతా ఇప్పటికే క్వారెంటైన్ కు తరలివెళ్లారు. ఆగస్టు 15 వరకూ వీరంతా సెల్ఫ్ క్వారెంటైన్ ( Self Quarantine ) లోనే ఉంటారు. Also read: North Carolina: అక్వేరియంలో కన్పించిన లక్షలాది నాణేలు..విలువ ఎంతో తెలుసా
మరోవైపు ఈ ప్రత్యేక కార్యక్రమం నాడు ప్రధాని మోదీతో పాటు మరి కొందరు వీవీఐపీలు హాజరుకానున్నారు. వీరందరి క్షేమం దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భారత సైన్యం ( Indian army ), వైమానిక దళం ( Air force ) , నావికా దళం ( Naval ) , ఢిల్లీ పోలీసు ( Delhi police ) అధికారులు, ఇతర సిబ్బంది హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. ఇక డ్రైవర్లు, ఆపరేటర్లు, కుక్స్, ట్రైనర్లు సైతం క్వారెంటైన్ లో ఉన్నారు. Also read: Bengaluru: ఆలయాన్ని కాపాడేందుకు ముస్లింల మానవహారం