CM Stalin: తెలంగాణ పథకాలు తమిళనాడులో అమలు చేసేందుకు కృషి చేస్తాం: సీఎం స్టాలిన్

Farmers Meet Stalin: తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని..తమిళనాడులోనూ ఆ పథకాలు అమలుచేయాలని కోరుతూ సీఎం స్టాలిన్ కు వినతిపత్రం అందజేశారు రైతు సంఘాల నాయకులు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 09:20 AM IST
  • చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘాల సమావేశం
  • తెలంగాణ పథకాలను కొనియాడిన నేతలు
  • అనంతరం స్టాలిన్ ను కలిసి వినతిపత్రం అందజేత
CM Stalin: తెలంగాణ పథకాలు తమిళనాడులో అమలు చేసేందుకు కృషి చేస్తాం: సీఎం స్టాలిన్

Southern States Farmers Meet CM Stalin: దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘాల సమావేశం (శనివారం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రామానికి తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు అధ్యక్షత వహించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు తదితర పథకాలపై చర్చించారు. కేసీఆర్ సర్కారు (KCR Govt) అమలు చేస్తున్న పథకాలు అన్ని రాష్ట్రాల్లోనూ అమలకావాలని రైతు సంఘాల నాయకులు ఆకాంక్షించారు. ఈ పథకాలు తమిళనాడులో (Tamilnadu) అమలు చేయాలని కోరుతూ...సీఎం స్టాలిన్ కు వినతి పత్రం అందజేశారు. తమిళనాడు సీఎం సానుకూలంగా స్పందించినట్లు వారు వెల్లడించారు. 

తెలంగాణలో వ్యవసాయ పథకాలు తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు పరిశీలిస్తామని సీఎం స్టాలిన్ (MK Stalin) హామీ ఇచ్చినట్లు కోటపాటి నర్సింహనాయుడు తెలిపారు. కనీస మద్ధతు ధరల విషయంలో కేంద్రానికి లేఖ రాసి సీఎం కేసీఆర్​ మరోసారి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సమావేశంలో పసుపు రైతుల సంఘం జాతీయ అధ్యక్షుడు పి.కె.దైవ శిగామణి, రాష్ట్రీయ కిసాన్‌ సంఘ్‌ కర్ణాటక శాఖ అధ్యక్షుడు శాంతకుమార్‌, కేరళ శాఖ అధ్యక్షుడు జాన్‌, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు రామ గౌండర్‌, పుదుచ్చేరి వ్యవసాయ సంఘం అధ్యక్షులు నికోలస్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Thalapathy Vijay: నా ఫ్యాన్స్ అంతా ఎలక్షన్స్‌లలో పోటీకి దిగండి.. హీరో విజయ్ బంపర్​ ఆఫర్‌‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News