Om Birla Fake Whatsapp Account: లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా పేరుతో నకిలీ వాట్సప్‌ అకౌంట్‌..!!

Om Birla Fake Whatsapp Account: దొంగలు రూట్‌ మార్చారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కొత్త కొత్త పంథాల్లో దొంగతనం చేస్తున్నారు. ఫేస్‌ బుక్‌ తో పాటు వాట్సప్‌ అకౌంట్లు కూడా నకిలీవి తయారుచేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 01:29 PM IST
  • లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా పేరుతో నకిలీ వాట్సప్‌ అకౌంట్‌
  • ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • నిందితులకు సైబర్‌ నేరగాళ్లతో లింకులు
Om Birla Fake Whatsapp Account: లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా పేరుతో నకిలీ వాట్సప్‌ అకౌంట్‌..!!

Om Birla Fake Whatsapp Account: దొంగలు రూట్‌ మార్చారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కొత్త కొత్త పంథాల్లో దొంగతనం చేస్తున్నారు. ఫేస్‌ బుక్‌ తో పాటు వాట్సప్‌ అకౌంట్లు కూడా నకిలీవి తయారుచేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. అది నకిలీదో.. నిజమైనదో తెలుసుకునేలోపు అందినకాడికి దోచేస్తున్నారు. చివరికీ వీఐపీల అకౌంట్లు కూడా డూప్లికేట్‌ చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. వీఐపీల డీపీలు ఏర్పాటుచేసుకుని వారే చాటింగ్‌ చేస్తున్నట్టు బోల్తా కొట్టిస్తున్నారు. తాజాగా లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా వాట్సప్‌ అకౌంట్‌ డీపీని ప్రొఫైల్‌ గా మార్చిన ముగ్గురు పోలీసులకు చిక్కారు.

సైబర్‌ నేరగాళ్లు ఏ ఒక్కరిని వదలడం లేదు. సామాన్యుల నుంచి వీఐపీల వరకు అందరూ కూడా సైబర్‌ నేరగాళ్లకు బాధితులుగా మారుతున్నారు. లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా పేరుతో నకిలీ వాట్సప్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేశారు. వెంటనే అప్రమత్తమైన స్పీకర్‌ కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

స్పీకర్‌ ఓం బిర్లా ఫోటోను డీపీగా ఉపయోగించి నకిలీ వాట్సప్‌ అకౌంట్‌ తయారుచేశారు. ఆ తర్వాత ఆర్థికసాయం చేయాలంటూ పలువురికి మేసేజ్‌ లు కూడా పంపించారు. ఈ ముగ్గురు నిందితులకు కూడా సైబర్‌ నేరగాళ్లతో లింకులు ఉన్నాయని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ముందుగా ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌ కార్డులు కొనుగోలు చేశారు. వాటిలో స్పీకర్‌ ఓం బిర్లా ఫోటోను అప్‌ లోడ్‌ చేసి వాట్సప్‌ అకౌంట్‌ తయారు చేశారు.

ఈ ముగ్గురు నిందితులను పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. స్పీకర్‌ ఓం బిర్లా పేరుతో ఎంత మందిని మోసం చేశారోనని ఆరా తీస్తున్నారు. అటు సిమ్‌ కార్డులపైనా కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నకిలీ గుర్తింపుకార్డులతో సిమ్‌ కార్డులు తీసుకున్న వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు.

తన వాట్సప్‌ అకౌంట్‌ డూప్లికేట్‌ అయినట్టు గుర్తించిన స్పీకర్‌ ట్విట్టర్‌  వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. 7862092008, 9480918183, 9439073870 ఈ నెంబర్ల నుంచి మేసేజ్‌, కాల్స్‌ వస్తే సమాధానం ఇవ్వద్దు అని రిక్వెస్ట్‌ చేశారు.
గత నెలలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరుపై కూడా ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ అయింది. ఆర్థికసాయం చేయాలని రిక్వెస్ట్‌ చేశాడు. వెంటనే ఉపరాష్ట్రపతి కార్యాలయం హోంశాఖను అప్రమత్తం చేసింది. ఇక తెలంగాణలోనూ పలువురు ఐఏఎస్‌ అధికారుల ఫోటోలను వాడుకుని నకిలీ వాట్సప్‌ అకౌంట్లు గతంలో క్రియేట్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి.

Also Read: Yashoda First Glimpse: ఆసుపత్రి బెడ్‌పై సమంత.. కిటికీలోంచి చేయి పెట్టి..!

Also Read: AP 10th Papers Leak: పదవ తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ వెనుక కారణాలివేనా, నిజమెంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News