Siddhanth Kapoor: డ్రగ్స్‌ కేసులో సిద్ధాంత్‌ కపూర్ విడుదల.. శ్రద్ధా కపూర్‌ ను ప్రశ్నిస్తారా?

Siddhanth Kapoor: కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరో సిద్దాంత్ కపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ రావడంతో ఆయనను  విడుదల చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.

Written by - Srisailam | Last Updated : Jun 14, 2022, 11:36 AM IST
  • డ్రగ్స్‌ కేసులో సిద్ధాంత్‌ కపూర్ విడుదల
  • ఆదివారం రాత్రి సిద్దాంత్ అరెస్ట్
  • బెంగళూరు హోటల్ లో రేవ్ పార్టీ
Siddhanth Kapoor: డ్రగ్స్‌ కేసులో సిద్ధాంత్‌ కపూర్ విడుదల.. శ్రద్ధా కపూర్‌ ను ప్రశ్నిస్తారా?

Siddhanth Kapoor: కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరో సిద్దాంత్ కపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ రావడంతో ఆయనను  విడుదల చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. సిద్ధాంత్‌ కపూర్ తో పాటు మరో నలుగురు నిందితులు బెయిల్ పై రిలీజ్ అయ్యారు. అయితే కోర్టు కొన్ని కండీషన్లు పెట్టింది. పోలీసులకు అందుబాటులో ఉండాలని, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.  

డ్రగ్స్ వినియోగిస్తున్నారనే ఆరోపణలపై ఆదివారం రాత్రి సిద్ధాంత్‌ కపూర్ ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎంజీ రోడ్డులోని ఓ స్టార్ హోటల్‌లో రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆ హోటల్ పై దాడి చేశారు. పార్టీలో ఉన్న 35 మందిని అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీకి హాజరైన వారు మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లుగా పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పార్టీలో పాల్గొన్న సిద్ధాంత్ కపూర్ తో పాటు మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నిందితులను కోర్టులో హాజరుపర్చారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత వాళ్లకు బెయిల్ వచ్చింది. దీంతో సిద్దాంత్ కపూర్ తో పాటు మిగిలిన నిందితులను పోలీసులు విడుదల చేశారు.

పార్టీలో దొరికిన వాళ్లకు పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. అందులో సిద్దాంత్ కపూర్ తో పాటు మరో నలుగురు డ్రగ్స్ తీసుకుందని తేలింది. డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలడంతో సిద్ధాంత్ కపూర్ తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశామని బెంగళూరు ఈస్ట్ జోన్ డీసీపీ భీమాశంకర్‌ తెలిపారు. అయితే నిందితులు హోటల్ లో జరిగిన పార్టీలోనే డ్రగ్స్ తీసుకున్నారా లేక బయట తీసుకున్నారా అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నారన్నదానిపై విచారణ చేస్తున్నామని డీసీపీ వెల్లడించారు.

బాలీవుడ్ టాప్ హీరో శక్తి కపూర్‌ కొడుకే  సిద్ధాంత్‌ కపూర్‌. శ్రద్ధా కపూర్‌ సోదరుడు. పలు హిందీ సినిమాల్లో ఆయన నటించారు. ‘భౌకాల్’, ‘షూట్‌ ఔట్‌ వాడాలా’, ‘అగ్లీ’ వంటి చిత్రాల్లో సిద్దాంత్ కీ రోల్ పోషించారు. డ్రగ్స్‌ కేసులో సిద్దాంత్ కపూర్ అరెస్టు కావడం సంచలనంగా మారింది. దేశంలో సంచలనం రేపిన సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులోనూ  శ్రద్దా కపూర్ పేరు తెరపైకి వచ్చింది.  2020లో ఆమెను నార్కోటిక్స్‌ అధికారులు ప్రశ్నించారు.

Read also: CM KCR: కేసీఆర్ షాకింగ్ న్యూస్... మమత మీటింగ్ కు డుమ్మా!

Read also: Mega Recruitment: నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే  ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News