17 Years Girl Raped For 3 Days In Lakhimpur Uttar Pradesh: చాలా మంది యువత ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కొందరుకాలేజీ డేస్ లో తమతో పాటు చదువుతున్న అమ్మాయితో ప్రేమల పడుతుంటారు. వర్క్ ప్లేస్ లలో కూడా కొందరు ప్రేమలోపడటం మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లికి ముందే లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు. ఇద్దరు కలిసి ఒకే చోట ఉంటూ కొంత కాలం జర్నీ చేస్తున్నారు. అంతేకాకుండా..ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు ఒకటైతే పెళ్లిచేసుకువాలనుకుంటున్నారు. లేకుంటే మధ్యలోనే తమ బంధాన్ని ముగించుకొని బ్రేకప్ లు చెప్పుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు తరచుగా మనం చూస్తున్నాం. కానీ కొందరు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటున్నారు. ప్రేమలో కొంత కాలంపాటు ఉంటున్నారు.
ఒక వేళ ప్రేమను అంగీకరించకుంటే దారుణంగా వేధిస్తున్నారు. కొందరు దాడులకు పాల్పడుతున్నారు. తమతో పర్సనల్ గా ఉన్నప్పటి ఘటనల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అమ్మాయిలను బ్లాక్ మెయిలింగ్ కు కూడా పాల్పడుతున్నారు. ఇలాంటివి మనం డైలీ చూస్తున్నాం. మరికొందరు మాత్రం..యువతులను కిడ్నాప్ చేసి, హత్యలు చేయడానికి సైతం వెనుకావడంలేదు. తమతో లివింగ్ రిలేషన్ ఉండాలంటూ కూడా వేధింపులకు గురిచేస్తున్నారు. యాసిడ్ దాడులక సైతం పాల్పడుతున్నారు. ఒక మనిషి రూపంలో ఉన్న సైకో మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తివివరాలు..
ఉత్తర ప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో జరిగిన అమానవీయకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక మైనర్ యువతిని,ఆమె బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకొవాలంటూ కొన్నినెలలుగా వేధిస్తున్నాడు. ఆమె ఇతగాడి వేధింపులు పడలేక, దూరం పెట్టింది. దీంతో యువతిని మాట్లాడుకుందామని పిలిచి ఆమెను గదిలో బంధించాడు. మూడు రోజుల పాటు ఆమెకు చిత్రహింసలు పెట్టాడు. అంతేకాకుండా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి, తనను పెళ్లిచేసుకొవాలంటూ కూడా షాడిజం చూపించాడు. అంతేకాకుండా.. ఐరన్ రాడ్ తో యువతి ముఖం మీద అమన్ అనే పేరును ప్రియుడు రాశాడు.
Read More: Wedding with Robo: లేడీ రోబోతో యువకుడి ప్రేమాయణం.. మూఢాల్లోనే పెళ్లి.. ఎక్కడో తెలుసా..?
ఈ క్రమంలో యువతి, అతగాడి బారి నుంచి అర్దరాత్రి తప్పించుకుంది. పోలీసుల వద్దకు వెళ్లి జరిగిన దారుణాన్ని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. యువకుడిపైకేసు నమోదుచేసి అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. నిందితుడికి కఠినంగా పనిష్మెంట్ చేయాలంటూ కూడా బాధితకుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మహిళ కమిషన్, మహిళ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొవాలంటూ తమ నిరనసలను తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. యోగి పాలనలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని అపోసిషన్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.అంతేకాకుండా.. యువతికి న్యాయం చేయాలంటూ కూడా నిరసనలు చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter