Omicron: మహారాష్ట్రలో మరో 7, రాజస్థాన్ లో 9 ...దేశంలో 21కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

Omicron: దేశంలో కొత్తగా మరో 16 ఒమిక్రాన్‌ వేరియంట్‌ కొవిడ్‌ కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో 7,  రాజస్థాన్‌లో 9 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2021, 09:30 PM IST
Omicron: మహారాష్ట్రలో మరో 7, రాజస్థాన్ లో 9 ...దేశంలో 21కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

Omicron:  భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌  చాపకిందనీరులా విస్తరిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య(Omicron Cases in India) 21కి చేరింది. తాజాగా మహారాష్ట్రలో 7, రాజస్థాన్ లో 9 కేసులు వెలుగుచూశాయి. గతంలో కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, దిల్లీలో ఒకటి, ముంబయిలో ఒకటి చొప్పున కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 

Also Read: Karnataka: కర్ణాటకలో 68 మంది విద్యార్థులకు పాజిటివ్‌

ఇటీవల దక్షిణాఫ్రికా(South Africa) నుంచి జైపూర్‌(Jaipur)కు వచ్చిన నలుగురిలో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా ఒమిక్రాన్(Omicron) నిర్ధారణ అయ్యింది. వారితో పరిచయం ఉన్న మరో ఐదుగురిని పరీక్షించగా వారికీ పాజిటివ్​గా తేలింది. వీరిలో ముగ్గురు చిన్న పిల్లలు ఉండటం విశేషం. ఒమిక్రాన్ పాజిటివ్​గా తేలిన వారిని ఆర్​యూహెచ్​ఎస్​ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

నైజీరియా(Nigeria) నుంచి వచ్చిన మహారాష్ట్ర(Maharashtra)లోని పింప్రి చించ్వాడ్‌కు చెందిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆ మహిళ సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెల్లో ఈ వేరియంట్‌ వెలుగుచూసింది. అలాగే ఫిన్లాండ్‌ నుంచి పుణె వచ్చిన మరో వ్యక్తిలోనూ ఈ రకం వైరస్‌ గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8కి చేరింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News