Serum Institute, Bharat Biotech Vaccines: న్యూఢిల్లీ: భారత ఫార్మా దిగ్గజాలు భారత్ బయోటెక్ (Bharat Biotech), సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( SII ) అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి రెండు రోజుల క్రితం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆయా వ్యాక్సిన్ల భద్రతకు సంబంధించి కంపెనీలు పూర్తి డేటా సమర్పించనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నిపుణుల కమిటీ స్పష్టంచేసింది.
ఈ వ్యాక్సిన్ల భద్రత అంశం గురించి మరింత సమాచారం ఇవ్వాలని, ఆతర్వాత తదుపరి నిర్ణయాన్ని వెల్లడిస్తామని సీడీఎస్‌సీఓ రెండు కంపెనీలకు కూడా సూచించింది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్, అదేవిధంగా వ్యాక్సిన్ల భద్రతకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ఇరు ఫార్మ కంపెనీలకు డీజీసీఐ ( DGCI ) ఆదేశాలిచ్చింది. Also read: Bharat Biotech: కోవ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి దరఖాస్తు
అయితే ఈ వ్యాక్సిన్లను పూర్తిగా తిరస్కరించలేదని.. వాటికి సంబంధించిన మరింత సమాచారాన్ని కోరినట్లు సీడీఎస్‌సీఓ వర్గాలు పేర్కొన్నాయి. డేటాకు సంబంధించి సీడీఎస్‌సీఓ.. భారత్ బయోటెక్ (Covaxin), సీరం ఇనిస్టిట్యూట్ ( oxford vaccine) కంపెనీలకు వేర్వేరు సూచనలు చేస్తూ సమాచారాన్ని కోరింది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అందించిన తరువాత మరోసారి సీడీఎస్‌సీఓ కమిటీ సభ్యులు ఈ టీకాల ఎమర్జెన్సీ వినియోగంపై నిర్ణయం తీసుకోనున్నారు. Also read: Anil Vij: కోవ్యాక్సిన్ తీసుకున్న హర్యానా మంత్రికి కరోనా పాజిటివ్
Also read: Good News: ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరం సీఈవో పూనావాలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి