Congress: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ఆ పార్టీ నేతలు వెల్లడించారు. సెప్టెంబర్ 22న పార్టీ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ రానుంది. 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. 19న కౌంటింగ్ జరగనుంది. ఈమేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ సీడబ్ల్యూసీ వర్చువల్‌గా సమావేశమైంది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జీ-23 అసమ్మతి గ్రూప్‌లోని నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌తోపాటు పలు అంశాలపై లోతుగా చర్చించారు. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని గతంలోనే నిర్ణయించారు. ఐతే షెడ్యూల్‌కు కొంత ఆలస్యంగా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
మరోవైపు ఆ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, యువ నేత జైవీర్ షెర్గిల్ కాంగ్రెస్‌ను వీడారు. తెలంగాణ నుంచి సీనియర్ నేత ఎంకే ఖాన్ సైతం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. వరుసగా నేతలు వీడితున్న క్రమంలో పార్టీ అధ్యక్ష ఎన్నికలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటు కాంగ్రెస్‌లో నేతల తీరుపై గులాం నబీ ఆజాద్ ఫైర్ అయ్యారు. పార్టీని రాహుల్ గాంధీ నాశనం చేశారని మండిపడ్డారు.
పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు గాంధీ కుటుంబీకులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఎన్నికలు అనివార్యమైంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు. దీంతో ఆ పదవిలో సీనియర్ నేతలను పెట్టాలని సోనియా, రాహుల్ గాంధీ భావించారు. ఐతే గాంధీ కుటుంబసభ్యులు ఉంటేనే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెచ్చారు. దీంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టారు.
ఇటీవల ఆమె ఆరోగ్యం సైతం క్షిణించింది. ఈక్రమంలో మళ్లీ రాహుల్ గాంధీనే పార్టీ పగ్గాలు అందుకోవాలని కాంగ్రెస్‌లో ఓ వర్గం భావిస్తోంది. ఐతే అందుకు ఆయన ఒప్పుకోవడం లేదు. గాంధీ యేతర వ్యక్తులను అధ్యక్ష పదవిలో ఉండాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఎన్నికల పెట్టడం ద్వారా పార్టీ నేతల అభిప్రాయం తెలియనుంది. మెజార్టీ ద్వారా బాస్‌ను ఎన్నుకోనున్నారు.
Also read:Nellore: నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు..దంపతుల దారుణ హత్య..!
Also read:Team India: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత ప్లేయర్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..అక్టోబర్ 17న ఎన్నికలు..!
త్వరలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు
షెడ్యూల్ విడుదల
అక్టోబర్ 17న ఎన్నికలు