Bank Holidays in April : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. నిత్యం బ్యాంకుల్లో పనులుండేవాళ్లు ఈ జాబితా చెక్ చేసుకోకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. ఈసారి ఏప్రిల్ నెలలో ఏకంగా 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే కొన్ని సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారనున్నాయి.
మార్చ్ 31తో 2023-24 ఆర్ధిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది. అదే సమయంలో ఆదివారాలు, రెండవ, నాలుగవ శనివారాలతో కలిపి ఏప్రిల్ నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. ఆర్బీఐ ఏప్రిల్ నెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. కొన్ని జాతీయ సెలవులు కాగా మరికొన్ని ప్రాంతీయ సెలవులున్నాయి. ఉగాది, ఈదుల్ ఫిత్ర్ ( రంజాన్ ) శ్రీరామనవమి వంటి పండుగలు ఏప్రిల్ నెలలోనే ఉన్నాయి.
ఏప్రిల్ నెల బ్యాంక్ సెలవుల జాబితా
ఏప్రిల్ 1 వార్షిక ఖాతాల ముగింపు కారణంగా బ్యాంకులు పనిచేయవు
ఏప్రిల్ 5 బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి-జుమా తుల్ విదా
ఏప్రిల్ 7 ఆదివారం సెలవు
ఏప్రిల్ 9 గుడి ఫడ్వా, ఉగాది సెలవు
ఏప్రిల్ 10 రంజాన్ ఈదుల్ ఫిత్ర్
ఏప్రిల్ 11 రంజాన్ ఈదుల్ ఫిత్ర్
ఏప్రిల్ 13 బైశాఖి, బిజూ పండుగ, రెండవ శనివారం సెలవు
ఏప్రిల్ 14 ఆదివారం సెలవు
ఏప్రిల్ 15 బోహాగ్ బిహు, హిమాచల్ డే
ఏప్రిల్ 17 శ్రీరామనవమి
ఏప్రిల్ 20 గరియా పూజ
ఏప్రిల్ 21 ఆదివారం సెలవు
ఏప్రిల్ 27 నాలుగో శనివారం సెలవు
ఏప్రిల్ 28 ఆదివారం సెలవు
Also read: SRH Sentiment: ఆరెంజ్ ఆర్మీకు ఆసిస్ కెప్టెన్ల సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి