Sabarimala Temple Income: అశేష సంఖ్యలో భక్తులు సందర్శించే క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భారీగా ఆదాయం లభించింది. మాలదీక్షల సమయంలో లక్షలాదిగా భక్తులు తరలిరాగా ప్రస్తుతం మాలదీక్ష సమయం ముగిసింది. నెల వ్యవధిలో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. రద్దీ సమయంలో ఆలయ హుండీ కాసులతో కళకళలాడింది. దీంతో హుండీని లెక్కించగా రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది.
Also Read: Ayodhya Ram Lalla: శ్రీరాముడి జన్మస్థలంలో తిరుమల వెంకటేశ్వరుడు.. త్వరలోనే అయోధ్యలో శ్రీవారి ఆలయం?
శబరిమల తీర్థయాత్ర సీజన్ ఆదాయం 2024-25 మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌లో ఆలయానికి భారీగా భక్తులు సందర్శించిన విషయ తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. హుండీతోపాటు తీర్థ ప్రసాదాలు, ఇతర సేవలకు సంబంధించిన ఆదాయం గణించారు. శబరిమల ఆలయం రికార్డు స్థాయిలో రూ.440 కోట్లు ఆర్జించిందని ట్రావెన్ కోర్ దేవస్వం మంత్రి వీఎన్ వాసవన్, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు చైర్మన్ పీఎస్ ప్రశాంత్ ప్రకటిచారు. ఆలయ హుండీ ఆదాయం విషయమై మీడియాకు వివరాలు వెల్లడించారు.
Also Read: Tirumala: తిరుమలలో మరో వివాదం.. వైకుంఠ ద్వార పుష్పాలంకరణపై రచ్చ
భక్తుల రద్దీ
ఈ సీజన్‌లో దాదాపు 53 లక్షల మంది భక్తులు శబరిమల ఆలయాన్ని సందర్శించారు. ఇది అపూర్వమైన యాత్రికుల రద్దీని ప్రదర్శిస్తోందని మంత్రి, ఆలయ కమిటీ పేర్కొంది. భక్తుల సంఖ్య పెరుగుదల గతేడాదితో పోలిస్తే 6,32,308 మంది భక్తులు పెరిగారు. తీర్థయాత్రకు పెరుగుతున్న ఆదరణకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
దర్శన నిర్వహణ స్పాట్ బుకింగ్ మొత్తం సందర్శకులలో 10,03,305 మంది భక్తులు స్పాట్ బుకింగ్ ద్వారా దర్శనం చేసుకున్నారు. వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ సిస్టమ్ ఈ వ్యవస్థ రోజుకు 90,000 నుంచి 1,08,000 మంది భక్తులకు వసతి కల్పించారు. కానీ భక్తులు 80,000 మంది అధికంగా వచ్చారు. అత్యధికంగా ఒకేరోజు 1,08,800 మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారని ఆలయ అధికారులు తెలిపారు.
ఆదాయం ఇలా..
- అరవణ ప్రసాదం విక్రయించడం ద్వారా ఈ ఏడాది రూ.192 కోట్లు ఆదాయం రాగా.. గతేడాది రూ.147 కోట్లు వచ్చింది.
- హుండీ ఆదాయం రూ.126 కోట్లు రాగా.. గతేడాది రూ.109 కోట్లు వచ్చింది.
- అప్పం ఆదాయం ఇంకా లెక్కించాల్సి ఉంది. గతేడాది రూ.17 కోట్ల ఆదాయం లభించింది.
- మొత్తం ఆదాయం గతేడాది రూ.360 కోట్లు రాగా.. ఈ ఏడాది రూ.440 రావడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.