ప్రియ ప్రకాశ్ పాటపై కేంద్రమంత్రి వరకు వెళ్లిన వివాదం!

ప్రియ ప్రకాశ్ వారియర్ పాటపై వివాదాలు ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేవు.

Last Updated : Feb 16, 2018, 11:49 PM IST
ప్రియ ప్రకాశ్ పాటపై కేంద్రమంత్రి వరకు వెళ్లిన వివాదం!

ప్రియ ప్రకాశ్ వారియర్ పాటపై వివాదాలు ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేవు. ఇప్పటికే ఆమె నటించిన మానిక్య మలరయ పూవి అనే పాట తమ మనోభావాలు దెబ్బతీసేలా వుందని హైదరాబాద్‌లో ఓ వర్గం పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఓ కేసు నమోదైంది. అది ఇంకా ఓ కొలిక్కి రాకముందే తాజాగా ఆ పాటపై నిషేధం విధించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానికి రజా అకాడమి ఓ లేఖ రాసింది. ప్రొఫెట్ మహ్మద్‌తోపాటు అతడి భార్యను కించపర్చేలా వున్న ఈ పాటపై నిషేధం విధించాల్సిందిగా రజా అకాడిమ ఈ లేఖలో కోరింది.

 

ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ సమాచారం ప్రకారం రెహ్మాని గ్రూప్‌కి చెందిన అకాడమి రాసిన ఈ లేఖలో పాటపై చాలా అంశాలనే ప్రస్తావించినట్టు తెలుస్తోంది. 'ఒరు అడార్ లవ్' సినిమాలోంచి ఆ పాటను తొలగించి దేశంలో మరో వివాదం తలెత్తకుండా చూసుకోవాల్సిందిగా కేంద్రమంత్రిని కోరిన రజా అకాడమి.. అందుకు అనుగుణంగా సెన్సార్ బోర్డుకు, ఆ సినిమా దర్శకుడికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా తమ లేఖలో విజ్ఞప్తి చేసింది. ఈ లేఖపై కేంద్ర మంత్రి ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి!!

Trending News