ఇన్‌స్టాగ్రామ్‌లో దూసుకుపోతోన్న రతన్ టాటా యవ్వనం నాటి ఫోటో

ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా కొద్దీ కాలం క్రితమే ఇన్ స్టాగ్రామ్ లో తన ఖాతాను ప్రారంభించారు. 82 ఏళ్ల రతన్ టాటా.. తాను యువకుడిగా ఉన్న సమయంలో తీసిన ఫొటోను ‘త్రోబ్యాక్ థర్స్ డే పిక్చర్’ గా ( తన పాత చిత్రాలను గురువారం నాడు పోస్ట్ చేసే ప్రక్రియ) తాజాగా పోస్ట్ చేశారు.

Last Updated : Jan 23, 2020, 11:10 PM IST
ఇన్‌స్టాగ్రామ్‌లో దూసుకుపోతోన్న రతన్ టాటా యవ్వనం నాటి ఫోటో

ముంబై : ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా కొద్దీ కాలం క్రితమే ఇన్ స్టాగ్రామ్ లో తన ఖాతాను ప్రారంభించారు. 82 ఏళ్ల రతన్ టాటా.. తాను యువకుడిగా ఉన్న సమయంలో తీసిన ఫొటోను ‘త్రోబ్యాక్ థర్స్ డే పిక్చర్’ గా ( తన పాత చిత్రాలను గురువారం నాడు పోస్ట్ చేసే ప్రక్రియ) తాజాగా పోస్ట్ చేశారు.

రతన్ టాటా 28 డిసెంబర్ 1937 న బొంబాయి, ఇప్పుడు ముంబైలో జన్మించారు. యువకుడిగా ఉన్నప్పుడు రతన్ టాటా బాలీవుడ్ హీరోకు తీసిపోని రీతిలో ఉన్నాడని  తన సహచరుల నుండి కామెంట్లు, షేర్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఈ ఫొటో లాస్ ఏంజెల్స్ లో ఉన్నప్పుడు తీసిందని రతన్ టాటా పేర్కొన్నారు. అమెరికాలోని జోన్స్ అండ్ ఎమ్మాన్స్ అనే సంస్థలో కొంతకాలం పనిచేసి 1962లో భారత్ కు తిరిగి వస్తోన్న సమయంలో ఈ ఫొటో తీయించుకున్నానని రతన్ టాటా పేర్కొన్నారు.

మరోవైపు ఆయన అభిమానులు కూడా రతన్ టాటా యువకుడిగా ఉన్న సమయంలో తీయించుకున్న మరో త్రోబ్యాక్ ఫొటోను పోస్ట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News