Ramadan 2023: రంజాన్ ఉపవాసాల్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎవరికి మినహాయింపు

Ramadan 2023: రంజాన్ మాసం వచ్చేసింది. ఇండియాలో ఎల్లుండి నుంచి ఉపవాస దీక్ష ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ సమయం  ఉపవాసం కష్టంగా మారకుండా శరీరానికి ఎనర్జీ కల్గించే ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలనే విషయంలో ముఖ్యమైన సూచనలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 21, 2023, 03:25 PM IST
Ramadan 2023: రంజాన్ ఉపవాసాల్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎవరికి మినహాయింపు

Ramadan 2023: పవిత్ర ఇస్లామిక్ నెల రంజాన్ రేపు సాయంత్రం నుంచి లేదా ఎల్లుండి సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది.  ఇవాళ, రేపు చంద్ర దర్శనాన్ని బట్టి ఉపవాస దీక్షలు ఎప్పుడు ప్రారంభమయ్యేది నిర్ణయమౌతుంది. ఈ క్రమంలో ఉపవాసదీక్షల్లో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.

సౌదీ దేశాల్లో ఇవాళ చంద్ర దర్శనమైతే రేపట్నించి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక ఇండియా సహా పొరుగు దేశాల్లో రేపు సాయంత్రం చంద్ర దర్శనమైతే ఎల్లుండ అంటే 23వ తేదీ నుంచి ఉపవాసాలు మొదలవుతాయి. సరిగ్గా 29 రోజుల తరువాత తిరిగి చంద్ర దర్శనంతో రంజాన్ మాసం పూర్తవుతుంది. మరుసటి రోజున ఈదుల్ ఫిత్ర్ పండుగ అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో రంజాన్ 9వ నెల. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల కావడంతో ఈ నెలకు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో అత్యంత మహత్యం కలిగి ఉంటుంది. 

ఉపవాస దీక్షల ఆచారణ, సాంప్రదాయం

రంజాన్ పవిత్ర నెలలో ఖురాన్ అందించినందుకు కృతజ్ఞతగా ముస్లింలు మొహమ్మద్ ప్రవక్త ఆచరణ మేరకు ఉపవాసాలుంటారు. ఉపవాస దీక్షలు ఆచరించడం ద్వారా ఆత్మ పరిశుద్ధమై అల్లాహ్ పాపాల్ని క్షమిస్తాడని నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా రంజాన్ నెలలో ఉపవాసాలుంటూ అల్లాహ్‌కు క్షమాపణలు కోరుతారు. సరైన మార్గదర్శనం చూపించమని వేడుకుంటారు. రంజాన్ నెలలో చేసే ప్రార్ధనలకు త్వరగా ఆమోదం పొందుతాయనేది ముస్లింల విశ్వాసం. సూర్యోదయం ముందు నుంచి సూర్యాస్తమయం వరకూ నెలంతా కఠిన ఉపవాస దీక్ష ఆచరిస్తారు. ఈ సమయంలో కనీసం మంచి నీళ్లు కూడా ముట్టరు. 

రంజాన్ నెలలో హెల్తీ ఫుడ్స్

ఉపవాస దీక్ష ప్రారంభించే ముందు తెల్లవారుజామున ముస్లింలు తీసుకునే భోజనాన్ని సహరీ అంటారు. సాయంత్రం వరకూ మనిషికి కావల్సిన శక్తిని, న్యూట్రిషన్లను అందిస్తుంది. తిరిగి సాయంత్రం సంధ్యవేళ దీక్షను అల్పాహారంతో ముగుస్తారు. దీనినే ఇఫ్తార్ అంటారు. 

రోజంతా వేసవిలో 12-13 గంటల ఉపవాసం భారంగా కాకుండా ఉండేందుకు హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. ఫలితంగా శరీరానికి ఎనర్జీ అందుతుంది. వేసవిలో రంజాన్ రావడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోసకాయ, కీరా, టొమాటో వంటి పండ్లను డైట్‌లో చేరుస్తారు. దాహాన్ని పెంచే సాల్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్‌కు దూరంగా ఉంటే మంచిది.

రంజాన్‌లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు

రంజాన్‌లో ఉపవాసం ఉండేవాళ్లు సాయంత్రం ఇఫ్తార్ తరువాత తిరిగి ఏదైనా తినడం గానీ తాగడం గానీ చేయాలి. కొంతమందికి మాత్రం ఉపవాస దీక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవాళ్లు, ప్రయాణాలు చేసేవారికి, గర్భిణీ మహిళలు, రుతుస్రావంలో మహిళలకు ఉపవాసం నుంచి మినహాయింపు ఉంది. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం కొత్త బట్టలు ధరించి నమాజ్ చేయడం ద్వారా ఈదుల్ ఫిత్ర్ పండుగ జరుపుకుంటారు. ఒకరికొకరు రంజాన్ ముబారక్ లేదా ఈద్ ముబారక్ చెప్పుకుంటారు. 

Also read: Ramadan 2023: రంజాన్ ఉపవాసాల్లో డయాబెటిస్ రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం తినాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News