Rajnikanth: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ ఖరారైంది. త్వరలో పార్టీను ప్రకటించనున్న రజనీకాంత్..ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోసారి ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
తమిళనాడు ( Tamil nadu ) అసెంబ్లీ ఎన్నికలు ( Assembly elections ) వచ్చే యేడాది జరగనున్నాయి. ఈ సందర్బంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ( Super star Rajnikanth ) ఏర్పాటు చేయనున్న రాజకీయపార్టీపైనే అందరి దృష్టి నెలకొంది. పార్టీ స్థాపిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఇప్పుడా పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. పార్టీ ఏర్పాటులో భాగంగా మరోసారి ముఖ్యనేతలతో రజనీకాంత్ సమావేశమయ్యారు.
ఇదే యేడాది చివరి రోజు పార్టీ ప్రకటన చేయనున్నారు. పార్టీ ఏర్పాట్లో భాగంగా ప్రత్యేక సలహాదారుడిగా అర్జున్ మూర్తి, తమిళురివి మణియన్‌లను నియమించారు. కొత్త రాజకీయ పార్టీని ఎక్కడ్నించి ప్రారంభించాలి, సమావేశం ఎక్కడ జరపాలనే విషయంపై చర్చలు జరిపారు.
డిసెంబర్ 3న రాజకీయ ప్రవేశం చేస్తున్నట్టు ట్విట్టర్ ( Twitter ) సాక్షిగా ప్రకటించినప్పటి నుంచి వేడి రాజుకుంది. డిసెంబర్ 31 న కొత్త పార్టీ స్థాపన ఉంటుందని పోయెస్ గార్డెన్ ( Poes gardens ) నివాసంలో మీడియాకు వెల్లడించారు. బెంగుళూరులోని సోదరుడు సత్యనారాయణ ఆశీస్సులు తీసుకుని రెండ్రోజుల క్రితమే రజనీకాంత్ చెన్నైకు తిరిగొచ్చారు. పార్టీ స్థాపించే రోజు ప్రకటించే ముఖ్య నేతల జాబితాలో ఎవరెవరుంటారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. Also read: West Bengal: బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి
Rajnikanth: వేగం పుంజుకున్న రజనీకాంత్ కొత్త పార్టీ ఏర్పాట్లు