74th Independence Day: రఫేల్‌ యుద్ధ విమానాలతో చైనాకు సంకేతాలు

భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా రఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) గత నెలలో వచ్చి చేరాయి. సరిహద్దు దేశాలు చైనా, పాకిస్తాన్‌లకు బుద్ధి చెప్పేందుకు, వారి ఆట కట్టించేందుకు భారత ఆర్మీ, భారత వాయుసేన సిద్ధంగా ఉన్నాయి.

Last Updated : Aug 11, 2020, 08:43 AM IST
74th Independence Day: రఫేల్‌ యుద్ధ విమానాలతో చైనాకు సంకేతాలు

74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కొన్ని రోజుల ముందు రఫేల్ యుద్ధ విమానాలు హిమాచల్ ప్రదేశ్‌లో కసరత్తులు ప్రారంభించాయి. గత నెల 29న రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి అంబాలాకు చేరుకోవడం తెలిసిందే. చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో తమ సత్తా చాటేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రఫేల్ ఫైటర్ జెట్‌లు భారత్‌కు అందాయి. తగ్గిన బంగారం ధరలు, వెండి పైపైకి

పాక్, చైనాలకు తమ సత్తా చాటేందుకు భారత ఆర్మీ, వాయుసేన సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా సరిహద్దుల్లో రఫేల్ యుద్ధ విమానాలతో తమ బలమేంటో చూపించాలని భారత్ పావులు కదుపుతోంది. భారత్, చైనా సరిహద్దులో రఫేల్ యుద్ధ విమానాలు తమ పనిని ప్రారంభించాయి. రఫేల్ యుద్ధ విమానాల కసరత్తులతో చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని భారత వాయుసేన భావిస్తోంది. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయోనని భావించిన కేంద్ర ప్రభుత్వం భారత వాయుసేనకు సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి 
COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే

లఢఖ్‌లోని డెస్పాంగ్ ప్రాంతంలో చైనా బలగాలు వెనక్కి వెళ్లాలని ఇరు దేశాల మేజర్ జనరల్ స్థాయి ద్వైపాక్షిక సమావేశాలలో భారత్ సూచించింది. మరోవైపు తూర్పు లఢఖ్‌లో, చైనా సరిహద్దు ప్రాంతాల్లో సుఖోయ్ 30ఎంకేఐ, జాగ్వర్ అండ్ మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో సిద్ధంగా ఉంది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 
RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు
  

Trending News