Punjab: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం-కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకే వేతనాలు

No vaccination no salary rule in Punjab: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనానికి కోవిడ్ వ్యాక్సినేషన్‌కు లింకు పెట్టింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికే వేతనాలు చెల్లించనున్నట్లు తెలిపింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2021, 07:54 PM IST
  • పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకే వేతనాలు
  • వ్యాక్సిన్ సర్టిఫికెట్లు కోరిన ప్రభుత్వం
  • సర్టిఫికెట్లు సమర్పించకపోతే నో సాలరీ
Punjab: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం-కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకే వేతనాలు

No vaccination no salary rule in Punjab: పంజాబ్ ప్రభుత్వం (Punjab Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనానికి కోవిడ్ వ్యాక్సినేషన్‌కు లింకు పెట్టింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికే వేతనాలు చెల్లించనున్నట్లు తెలిపింది. రెండు డోసులు లేదా ఒక డోసు తీసుకున్న ఉద్యోగులకు యథావిధిగా వేతనాలు అందుతాయి. అయితే ఇందుకోసం ఆ ఉద్యోగులు తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్లను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. సర్టిఫికెట్లు సమర్పించని ఉద్యోగులకు వేతనాలు చెల్లించరు.

ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యాక్సినేషన్‌ను ప్రమోట్ చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంకా వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటారనే విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. వ్యాక్సినేషన్ పూర్తయిన లేదా సింగిల్ డోసు తీసుకున్న ఉద్యోగులు పంజాబ్ ప్రభుత్వానికి చెందిన iHRS(Integrated Human Resource Management System) పోర్టల్‌లో సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సిందిగా సూచించింది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటివరకూ 210 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రతపై ఇంకా కచ్చితమైన సమాచారం లేనప్పటికీ కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఒమిక్రాన్ (Omicron Cases) కట్టడికి అవసరమైతే రాత్రి కర్ఫ్యూలు విధించాలని రాష్ట్రాలకు సూచించింది. ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో జనం పెద్ద ఎత్తున గుమిగూడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: Gurugram: గురుగ్రామ్ మహిళకు భయానక అనుభవం-కదులుతున్న ఆటో నుంచి దూకేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News