బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ప్రభుత్వ అధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రభుత్వ అధికారులకంటే వేశ్యలే నయమని సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.
‘ప్రభుత్వ అధికారుల కంటే వేశ్యలే నయం. కనీసం వారు డబ్బులు తీసుకుని పని అయినా చేస్తారు. స్టేజీలపై డ్యాన్స్‌లు చేస్తారు. కానీ ప్రభుత్వ అధికారులు డబ్బులు తీసుకుంటారు. పని చేస్తారో చేయరో గ్యారెంటీనే లేదు’ అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. అంతేకాదు లంచాలు అడిగితే ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ అధికారులను అక్కడే చెప్పులతో కొట్టండి అంటూ ఆయన మద్దతుదారులను ఆదేశించారు. ప్రభుత్వ అధికారి లంచం అడిగితే వాయిస్ రికార్డ్ చేయాలని కూడా తన మద్దతుదారులకు సూచించారు.
Officials se accha charitra vaishyaon ka hota hai, woh paisa lekar kam se kam apna kaam toh karti hain aur stage pe naachti hain. Par yeh officials toh paisa lekar bhi aapka kaam karenge ki nahi, iski koi guarantee hi nahi hai: Surendra Singh, BJP MLA pic.twitter.com/e9kTWxwX8F
— ANI UP (@ANINewsUP) June 5, 2018
సురేంద్ర సింగ్ ఇలాంటి కామెంట్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకముందు కూడా దేశంలో అత్యాచార ఘటనలు పెరగడానికి కారణం తల్లిదండ్రులేనని, వారి పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. తన సొంత పార్టీకి చెందిన యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై కూడా ఆయన మండిపడ్డారు.