Priyanka Gandhi to isolate : ఐసోలేషన్‌లో ప్రియాంక గాంధీ.. వారికి కోవిడ్ పాజిటివ్ అట!

Priyanka Gandhi in home isolation : హోమ్ ఐసోలేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ప్రియాంక వ్యక్తిగత సిబ్బందికి కరోనా. కోవిడ్ నెగెటివ్ వచ్చినా జాగ్రత్తలు పాటిస్తోన్న ప్రియాంక గాంధీ.

Last Updated : Jan 3, 2022, 11:56 PM IST
  • హోమ్ ఐసోలేషన్‌లో ప్రియాంక గాంధీ
  • ప్రియాంక వ్యక్తిగత సిబ్బందికి కోవిడ్ పాజిటివ్
  • సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రియాంక
Priyanka Gandhi to isolate : ఐసోలేషన్‌లో ప్రియాంక గాంధీ.. వారికి కోవిడ్ పాజిటివ్ అట!

Priyanka Gandhi in home isolation as family member, staff test positive for Covid : కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో (home isolation) ఉన్నారు. ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) కుటుంబ సభ్యుల్లో ఒకరికి తాజాగా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రియాంక వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా (Corona positive‌) నిర్ధారణ అయింది. దీంతో ప్రియాంక గాంధీ కోవిడ్‌‌‌-19 టెస్ట్ (Covid‌‌‌-19 Test) చేయించుకున్నారు. అందులో కోవిడ్ నెగెటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. 

అయితే డాక్టర్స్ సూచనల మేరకు కొన్ని రోజుల పాటు హెమ్ ఐసొలేషన్‌లోనే ఉంటానని చెప్పారు ప్రియాంక గాంధీ. అలాగే కొన్ని రోజుల తర్వాత మళ్లీ కోవిడ్ పరీక్ష (Covid test) చేయించుకుంటానని ప్రియాంక తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రియాంక.

 

ఇక మరోవైపు దేశంలో కరోనా (Corona) విజృంభిస్తోంది. కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో గత సోమవారం 6,358 కోవిడ్ కేసులుండగా, (Covid cases) ఈ సోమవారానికి ముప్పై మూడు వేలకు పెరిగాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై సిటీ కోవిడ్‌తో వణికిపోతోంది. తాజాగా అక్కడ 8,082 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

అలాగే ముంబై నుంచి గోవా వెళ్లిన ఒక కార్డెలియా క్రూజ్‌నౌకలో కూడా కోవిడ్ కల్లోలం సృష్టించింది. ఇందులో రెండు వందల మందికి పైగా ప్రయాణికులుండగా.. అరవై ఆరు మందికి కోవిడ్ (Covid) వచ్చినట్లు తేలింది.

అలాగే ఢిల్లీలో ఒమిక్రాన్‌ వేరియెంట్ (Omicron variant) విజృంభిస్తోంది. ఢిల్లీలో గత 24 గంటల వ్యవధిలో నాలుగు వేల తొంభై తొమ్మిది కోవిడ్ కేసులు బయటపడ్డాయి. ఒమిక్రాన్‌ వేరియెంట్ విజృంభనతో అక్కడ ఆంక్షలు అమలులో ఉన్నాయి. నైట్‌ కర్ఫ్యూ (Night curfew) కొనసాగుతోంది. పాఠశాలలు, సినిమాహాల్స్, జిమ్‌ సెంటర్స్ మూతపడ్డాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను యాభై శాతం కెపాసిటీతో రన్ చేస్తున్నారు.

Also Read : IND Vs SA 2nd Test: తొలిరోజు చేతులెత్తేసిన ఇండియన్ బ్యాటర్లు.. దక్షిణాఫ్రికా స్కోరు 35/1

ఇక వెస్ట్‌ బెంగాల్, బిహార్‌‌లలో 180మందికి పైగా డాక్టర్లు కరోనా బారినపడ్డారు. పట్నాలోని నలంద హాస్పిటల్‌లో ఎనభై ఏడు మంది డాక్టర్స్ కోవిడ్ (Covid) బారినపడ్డారు. వీరు అంతా ఇటీవల పట్నాలో నిర్వమించిన ఐఎంఏ వార్షిక సదస్సుకు హాజరయ్యారు. వారం కిందట జరిగిన ఈ సదస్సులో బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read : Telangana Schools Closed: తెలంగాణలో స్కూళ్లకు సెలవులు.. లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News