Pregnant women: గర్భిణీలకు కొవిడ్-19 టీకాలు.. అనుమతించిన కేంద్రం

COVID-19 vaccine for pregnant women: న్యూ ఢిల్లీ: గర్భిణీలు కొవిడ్-19 టీకాలు తీసుకోవడానికి అనుమతిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ప్రెగ్నెంట్ లేడీస్ ఇకపై కొవిన్ పోర్టల్‌లోకి (How to register vaccine for pregnant women on CoWin portal) లాగిన్ అయి కొవిడ్-19 టీకా కోసం తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని కేంద్రం స్పష్టంచేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2021, 08:56 PM IST
Pregnant women: గర్భిణీలకు కొవిడ్-19 టీకాలు.. అనుమతించిన కేంద్రం

COVID-19 vaccine for pregnant women: న్యూ ఢిల్లీ: గర్భిణీలు కొవిడ్-19 టీకాలు తీసుకోవడానికి అనుమతిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఇమ్యూనైజేషన్స్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGI) సిఫార్సులపై స్పందిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రెగ్నెంట్ లేడీస్ ఇకపై కొవిన్ పోర్టల్‌లోకి (How to register vaccine for pregnant women on CoWin portal) లాగిన్ అయి కొవిడ్-19 టీకా కోసం తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని కేంద్రం స్పష్టంచేసింది. లేదా, సమీపంలోని కొవిడ్-19 టీకా కేంద్రానికి నేరుగా వెళ్లి కూడా తమ పేరు నమోదు చేసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది.

గర్భిణీలకు కొవిడ్-19 టీకాలతో (Vaccine for pregnant women) ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ ఇటీవలే అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. శుక్రవారం వరకు దేశవ్యాప్తంగా కొవిడ్-19 టీకాలు తీసుకున్న వారి సంఖ్య 34 కోట్లు దాటిందని కేంద్రం ఆరోగ్య శాఖ తమ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 18-44 ఏళ్ల ఏజ్ గ్రూప్ వారిలో 9,41,03,985 మంది ఫస్ట్ డోస్ (First dose) తీసుకోగా.. 22,73,477 మంది సెకండ్ డోస్ (Second dose) తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. 

Also read : Vaccine Policy: వ్యాక్సిన్ విధానంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఇవాళ్టి నుంచి అమలు

ప్రెగ్నెన్సీతో ఉన్న వారిలో అధిక శాతం వరకు కరోనా లక్షణాలు (COVID-19 symptoms in pregnant ladies) ఎక్కువగా కనిపించే ఆస్కారం లేదని, లేదా స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించినప్పటికీ.. ఆరోగ్యం వేగంగా క్షీణించే ప్రమాదం ఉంటుందని, ఫలితంగా కడుపులో ఉన్న బిడ్డపైనా కరోనా వైరస్ (COVID-19) ప్రభావం చూపించే ప్రమాదం లేకపోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది.

Also read : Covovax: సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు షాక్, చిన్నారులపై కోవొవాక్స్ క్లినికల్ ట్రయల్స్‌కు నో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News