తమిళనాడులో ఇద్దరు స్టార్ హీరోల మధ్య రాజకీయ వేడి రాజుకుంటోంది. రజినీకాంత్ వర్సెస్ కమల్ హాసన్ పాలిటిక్స్ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇటీవల మక్కల్ నీది మయ్యమ్ పేరుతో కమల్ హాసన్ రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ ఇంకా పార్టీ పేరును ప్రకటించలేదు ఇంకా బ్యాక్ గ్రౌండ్ వర్క్ లోనే బిజీగా ఉన్నాడు. రజినీకాంత్ ఎవరికీ అర్ధం కాని రీతిలో రాజకీయాన్ని నడిపిస్తున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం. అభిమానులతో కూడా రజినీకాంత్ సమావేశాలను జరుపుతూనే ఉన్నారు.
ఇటీవలే కమల్ హాసన్ రాజకీయ పరంగా రజినీకాంత్ కు ఒక సవాల్ ని విసిరారు. రజినీకాంత్ చాలా వరకు కొన్ని విషయాల్లో సైలెంట్ గా ఉంటున్నారన్నారు. ఆ విధంగా ఆయన ఎందుకు ఉంటున్నారో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ముఖ్యంగా కావేరి నది జలాల గురించి రజినీ అంతలా ఏమీ స్పందించడం లేదు. కనీసం నిరసన కార్యక్రమాలల్లో కూడా పాల్గొనటం లేదు అని కమల్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అంతే కాకుండా కావేరీ మేనేజ్మెంట్ బోర్డును వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాలని చేసిన రజినీ తమిళులకు మద్దతుగా ఎందుకు తన అభిప్రాయాన్ని చెప్పలేదని ప్రశ్నించారు. చివరగా ఈ విషయంపై రజినీ స్పందించాలని కోరారు.
రజినీకాంత్‌కు కమల్ హాసన్ ఛాలెంజ్ !