Ayodhya Tour: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి కౌంట్‌డౌన్ జరుగుతోంది. జనవరి 22వ తేదీన రాముని ప్రాణ ప్రతిష్ఠ అత్యంత ఘనంగా జరగనుంది. ఈలోగా అయోద్య నగరికి కొత్త సొగసులు, సౌకర్యాలు సమకూరనున్నాయి. మోడర్న్ రైల్వేస్టేషన్, కొత్త ఎయిర్‌పోర్ట్ రూపుదిద్దుకున్నాయి.
కొత్త ఏడాది జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ ఏర్పాట్లు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల్నించి లక్షలాదిగా భక్తజనం, వీవీఐపీలు తరలిరానున్నారు. ఈ క్రమంలో అయోధ్యకు కొత్త సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. ప్రపంచపటంతో అయోధ్యను అన్నిరకాలుగా కలిపేందుకు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మించారు. మరోవైపు రైల్వేస్టేషన్‌ను ఆధునీకరించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అయోధ్యలో నిర్మించిన ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లను ప్రారంభించనున్నారు.
అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయోధ్య థామ్‌గా నామకరణం చేశారు. ఇవాళ్టి నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా విమానాలు తిరగనున్నాయి. ఈ రెండు సంస్థలు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు ప్రకటించాయి. మద్యాహ్నం 12.15 గంటలకు ప్రధాని మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు.
అంతకంటే ముందు పూర్తి స్థాయి సౌకర్యాలతో ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ఉదయం 11.15 గంటలకు మోదీ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా అమృత్ భారత్ రైళ్లు, 6 వందేభారత్ రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రెండింటి ప్రారంభం తరువాత రాష్ట్రంలో చేచపట్టిన 15,700 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో అయోధ్య పరిసర ప్రాంతాల్లోనే 11 వేల 100 కోట్ల ప్రాజెక్టులున్నాయి. మిగిలినవి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందినవి. అయోధ్యలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.
Also read: Rammandir Features: రామాలయం లోపల ఎలా ఉంటుంది, ఎంట్రీ, ఎగ్జిట్ ఎలా ఉంటాయి, ఏయే వసతులుంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook