కరోనాపై పోరాటాన్ని కొనసాగిస్తూనే.. ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడమే లక్ష్యం.. ప్రధాని మోదీ

కరోనా మహమ్మారిపై పోరాటాన్ని కొనసాగిస్తూ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా మే 3న లాక్డౌన్ ముగియనున్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సహా

Last Updated : May 1, 2020, 05:16 PM IST
కరోనాపై పోరాటాన్ని కొనసాగిస్తూనే.. ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడమే లక్ష్యం.. ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటాన్ని కొనసాగిస్తూ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా మే 3న లాక్డౌన్ ముగియనున్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 Also read : ఏపీలో కరోనా విజృంభణ.. తాజాగా 60 పాజిటివ్ కేసులు, ఇద్దరు మృతి

కాగా విమానాలు, రైళ్లను పున: ప్రారంభించడం అనే అంశాలపై ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉందని సమాచారం. "రెడ్ జోన్" COVID-19 ప్రభావిత ప్రాంతాలలో ఆంక్షలు కొనసాగుతాయని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న లక్షలాది మంది వలస కార్మికులు, విద్యార్థులను  తమ స్వస్థలాలకు చేరుకోవటానికి అనుమతించింది. అయితే వలస కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నుండి జార్ఖండ్ 1200ల మంది ప్రయాణికులకు రవాణా ఏర్పాట్లు చేసింది. .

Also read : Coronavirus పుట్టుకపై అమెరికా ఇంటెలీజెన్స్ కీలక ప్రకటన

భారతదేశం అంతటా కరోనావైరస్ హాట్‌స్పాట్‌ల సంఖ్య 15 రోజుల్లో 23 శాతం తగ్గిందని, ఏప్రిల్ 15 నుండి 30వరకు 170నుండి 130కి పడిపోయిందని పేర్కొన్నారు. "గ్రీన్ జోన్లు" COVID-19 కొత్త కేసులు నమోదు చేయని జిల్లాలు 356 నుండి 319 కి తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో వైపు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం మార్చి 25న విధించిన లాక్‌డౌన్‌ను మరోసారి మే15 వరకు పొడిగించాలని సిఫారసు చేసిన విషయం తెలిసిందే.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News