PM Modi Gets Emotional in Rajasthan Election Rally: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. భారీ బహిరంగ సభలో పార్టీ సీనియర్ నాయకుడిని గుర్తుపట్టి.. ఆరు దశాబ్దాలుగా ఆయన పార్టీ కోసం కృష్టి చేస్తున్నారని గుర్తుచేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్‌లో జరిగిన ర్యాలీలో 95 ఏళ్ల బీజేపీ నేత ధరమ్‌చంద్ దేరాసరియా సాధారణ ప్రేక్షకుల మధ్య కూర్చున్నారని ఎమోషనల్ అయ్యారు. రాజ్‌సమంద్‌లోని దేవ్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దాదాపు ఆరు దశాబ్దాల ధరమ్ చంద్ తన జీవితంలో పార్టీకి అంకితం చేశారని కొనియాడారు. ఇప్పుడు ఈ వయస్సులో ప్రజల మధ్య కూర్చుని.. మనలో ప్రతి ఒక్కరినీ ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. రాజస్థాన్‌లో ప్రచారానికి ఇదే చివరి రోజు అని.. ఇది తన చివరి కార్యక్రమం అని చెప్పారు. ఆయన ఆశీస్సులు పొందినప్పుడు తమ ప్రచారానికి మరింత ఊపు వచ్చిందన్నారు. 95 సీనియర్ నేతకు ప్రధాని చేతులతో గౌరవం చూపించడంతో సభలో చప్పట్లతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
VIDEO | "Derasariya Ji spent nearly six decades for this ideology, and is now blessing us while sitting down there," said PM Modi as he recognised a senior party worker sitting in the crowd during his rally in Deogarh, Rajasthan. pic.twitter.com/ZbcAM65ukU
— Press Trust of India (@PTI_News) November 23, 2023
బుధవారం జరిగిన మరో ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ వంశపారంపర్య రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. "కాంగ్రెస్ చరిత్ర మీకు తెలుసు. పార్టీలో అక్రమాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని ఎవరు ప్రయత్నించినా.. ఢిల్లీలో హైకమాండ్ ఆగ్రహంతో రాజకీయ ఉనికిని కోల్పోతారు. రాజేష్ పైలట్ ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా.. అది కూడా అభ్యున్నతి కోసం తన స్వరం వినిపించారు. ఆయనపై ఉన్న కోపంతో సచిన్ పైలట్‌ను శిక్షిస్తోంది. రాజేష్ పైలట్ ఇక లేరు. అయితే కాంగ్రెస్ ఆయన కొడుకు పట్ల ద్వేషపూరిత భావనతో ఉంది" అని ప్రధాని అన్నారు. సోనియా గాంధీని ప్రధాని మంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకుడు రాజేష్ పైలట్ వ్యతిరేకించిన కొద్ది మందిలో ఒకరని ప్రధాని గుర్తుచేశారు.
రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. నవంబర్ 25న రాజస్థాన్‌లోని 199 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ మృతి చెందడంతో కరణ్‌పూర్ నియోజకవర్గంలో పోలింగ్ వాయిదా పడింది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడి కానున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు సాధించగా.. బీజేపీ 73 సీట్లు గెలుచుకుంది. మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నెల 25న ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. డిసెంబర్ 3న భవితవ్యం తేలిపోనుంది.
Also Read: Pawan Kalyan: అధికారం ఏ ఒక్కరి సొత్తూ కాదు.. దుబ్బాకలో పవన్ కళ్యాణ్ ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
PM Modi: భారీ జనసందోహంలో పార్టీ సీనియర్ కార్యకర్త.. గుర్తుపట్టి ప్రధాని మోదీ ఎమోషనల్