PM Modi on PSLV C 51 Success: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పీఎస్‌ఎల్వీ సీ-51 ప్రయోగం విజయవంతం కావడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో, ఎన్‌ఎస్‌ఐఎల్‌కు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం కొత్త ఆవిష్కరణలకు నిదర్శనమని కితాబిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట( Sriharikota )లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ( Satish Dhawan space centre) నుంచి పీఎస్ఎల్వీ సీ 51 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 10 గంటల 24 నిమిషాలకు విజయవంతంగా రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సి 51 రాకెట్ తో పాటు 637 కిలోల బరువున్న బ్రెజిల్ దేశానికి చెందిన అమెజానియా–1 (Amazonia-01) ఉపగ్రహం, అమెరికాకు చెందిన స్పేస్ బీస్ ఉపగ్రహాల శ్రేణిలో 12, సాయ్–1 నానో కాంటాక్ట్–2 ఉపగ్రహాల్ని ప్రయోగించారు. న్యూ స్పేస్ ఇండియా పేరుతో భారత ప్రైవేట్ సంస్థలకు చెందిన సతీష్ ధవన్ శాట్, సింధు నేత్ర, దేశంలోని మూడు వర్సిటీలకు చెందిన శ్రీ శక్తి శాట్, జిట్‌శాట్, జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌లను అంతరిక్షంలోకి పంపించారు. ఇది ఇస్రోకు సంబంధించి తొలి పూర్తి స్థాయి వాణిజ్యపరమైన ప్రయోగం.
ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ( Pm Narendra modi) హర్షం వ్యక్తం చేస్తూ ఇస్రో శాస్త్రవేత్తలకు ( Isro Scientists) అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం సరికొత్త ఆవిష్కరణలకు దారి తీసిందని చెప్పారు. అంతరిక్ష సంస్కరణల్లో కొత్త శకం ప్రారంభమైందని..19 ఉపగ్రహాల ప్రయోగం దీనికి నిదర్శనమన్నారు. అటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా ఇస్రో ( Isro) శాస్త్రవేత్తల్ని అభినందించారు. ఇస్రో, బ్రెజిల్ అనుసంధానంతో తొలి ప్రయోగం విజయవంతం కావడం గర్వంగా ఉందని ఇస్రో ఛీఫ్ కే శివన్ చెప్పారు. ఈ ప్రయోగంలో దేశీయ ప్రైవేట్ సంస్థలకు చెందిన 5 ఉపగ్రహాలు, 14 విదేశీ ఉపగ్రహాలున్నాయి. ఉపగ్రహం ద్వారా తొలిసారిగా ప్రధాని మోదీ ఫోటో, భగవద్గీత కాపీతో పాటు 25 వేల మంది పేర్లను పంపించారు. ఈ పేర్లలో వేయి మంది విదేశీయుల పేర్లున్నాయి.
Also read; PSLV C 51 Launch: అంతరిక్షంలో విజయవంతంగా పీఎస్ఎల్వీ సీ 51 రాకెట్, తొలిసారిగా భగవద్గీత, మోదీ ఫోటో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook