PM Modi Kedarnath Visit: శాసనసభ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi Kedarnath Visit) పర్యటిస్తున్నారు. ఈ ఉదయం డెహ్రాడూన్ చేరుకున్న మోదీకి.. రాష్ట్ర గవర్నర్ గుర్మిత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, స్థానిక అధికారులు ఘనస్వాగతం పలికారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు నేడు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా.. రాష్ట్రంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.
Uttarakhand | PM Modi arrives at Kedarnath, to offer prayers at the shrine and also inaugurate Adi Shankaracharya Samadhi shortly pic.twitter.com/Lt1JGtxXFQ
— ANI (@ANI) November 5, 2021
కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. 2013లో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న.. శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని ప్రధాని పునఃప్రారంభించనున్నారు. ఆ వెంటనే శ్రీ ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
కొత్తగా నిర్మించిన ఆది శంకరాచార్యుల సమాధి, విగ్రహంతోపాటు సరస్వతి ఘాట్, 130 కోట్ల ఇన్ ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభిస్తారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి (Pushkar Singh Dhami News) తెలిపారు. కాగా, ప్రధాని కేదార్‌నాథ్ పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం దేశవ్యాప్తంగా సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
Also Read: Modi Diwali Celebrations: దేశానికి సైన్యమే సురక్షా కవచమన్న మోదీ
Also Read: Temple for PM Modi: ప్రధాని మోదీకి గుడి.. అయోధ్యలో Ram mandir నిర్మిస్తున్నందుకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe