PM Kisan Samman Nidhi: రైతులకు గుడ్ న్యూస్, త్వరలో బ్యాంక్ ఖాతాలో రూ.2000 జమ

PM Kisan Samman Nidhi Yojana Benefits: కేంద్ర ప్రభుత్వం ఏటా 3 దఫాలుగా మొత్తం రూ.6000ను రైతుల ఖాతాల్లో జమ చేసి ఆర్థిక చేయూత అందిస్తుంది. ఇప్పుడు రైతుల ఖాతాకు మార్చి 31 లోగా రూ .2,000 రైతులకు రావాల్సి ఉంది. లేనిపక్షంలో ఏప్రిల్ నెలలో రైతులకు పీఎం కిసాన్ నగదు లభిస్తుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 8, 2021, 12:15 PM IST
PM Kisan Samman Nidhi: రైతులకు గుడ్ న్యూస్, త్వరలో బ్యాంక్ ఖాతాలో రూ.2000 జమ

PM Kisan Samman Nidhi Benefits: And Eligibility: రైతన్నల కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మన్ నిధి స్కీమ్. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని డిసెంబర్ 1, 2018న ప్రారంభించింది. రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. 

కేంద్ర ప్రభుత్వం ఏటా 3 దఫాలుగా మొత్తం రూ.6000ను రైతుల ఖాతాల్లో జమ చేసి ఆర్థిక చేయూత అందిస్తుంది. తొలి విడత రూ.2000 నగదును ఏప్రిల్-జూలై మధ్య కాలంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఆగస్టు-నవంబర్ మరియు డిసెంబర్-మార్చి మధ్య కాలంలో 2వ, 3వ దఫా పీఎం కిసాన్ సమ్మన్ నిధి (PM Kisan Samman Nidhi) నగదును రైతులు అందుకుంటారు. 

కేంద్ర ప్రభుత్వం 100 శాతం నిధులు సమకూర్చే ఈ పథకానికి రైతులకు రూ .6 వేల సబ్సిడీ లభిస్తుంది. రైతుల బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేస్తారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి (PM Kisan Samman Nidhi Yojana) తాజా దఫా నగదు కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరులోగా నమోదు చేసుకుంటే రూ .2 వేలు రైతు ఖాతాలో జమ అవుతుందని చెబుతున్నారు. ఇప్పుడు రైతుల ఖాతాకు మార్చి 31 లోగా రూ .2,000 రైతులకు రావాల్సి ఉంది. లేనిపక్షంలో ఏప్రిల్ నెలలో రైతులకు పీఎం కిసాన్ నగదు లభిస్తుంది.

Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి

3 వాయిదాలలో రైతుల ఖాతాకు డబ్బు జమ:

మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు రైతుల ఖాతాలకు రూ.2 వేలు జమ చేస్తారు

రెండవ విడత ఆగస్టు 1 నుండి నవంబర్ 30 వరకు ఉంటుంది

మూడవ విడత డిసెంబర్ 1 నుండి మార్చి 31 మధ్య మూడో దఫా రూ.2000 జమ అవుతాయి

Also Read: Maganti Ramji Passed Away: టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు తనయుడు రాంజీ కన్నుమూత

పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం లబ్ధిదారులు పూర్తి వివరాలు, అర్హుల జాబితా కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలి

రైతు కార్నర్‌(Farmer Cornor)కు వెళ్లి కొత్త రైతుల నమోదు కోసం క్లిక్ చేయాలి

మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి

కాప్చా కోడ్‌(Captcha Code)ను టైప్ చేయాలి

అనంతరం మీకు కావలసిన మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి

మీ వ్యక్తిగత సమాచారంతో ఫామ్ నింపాలి

మీ బ్యాంక్ ఖాతా నెంబర్, ఇరత్రా వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయండి

పీఎం కిసాన్ స్కీమ్‌లో రైతు నమోదు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు:

ఆధార్ కార్డు

పౌరసత్వ ధృవీకరణ పత్రం

భూ యాజమాన్య సంబంధిత పత్రాలు

బ్యాంక్ అకౌంట్ ఖాతా వివరాలు, ప్రొఫైల్

Helpline Number: రైతన్నలు తమ పీఎం కిసాన్ సమ్మన్ నిధి దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడానికి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606 కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News