ఓ దేశానికి జాతీయ పతాకం ఎంతో విలువైన, ఎన్నో విజయాలకు ఆకాంక్షలకు, శ్రమకు ప్రతీకగా జాతీయ పతాకం నిలుస్తోంది. అలాంటి భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 144వ జయంతి (Pingali Venkayya Birth Anniversary) నేడు (ఆగస్టు 2). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు పింగళి వెంకయ్య (Pingali Venkayya) సేవలను కొనియాడుతూ ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నారు. Mohan Babu ఫ్యామిలీకి వార్నింగ్.. నలుగురు యువకులు అరెస్ట్
‘స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయపతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. #PingaliVenkayya దేశభక్తి, అంకితభావం నుంచి నేటి యువత స్ఫూర్తి పొందాలని ఆకాంక్షిస్తున్నానంటూ’ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ఆర్జీవీ నెక్ట్స్ మూవీ ‘Allu’.. మళ్లీ రచ్చ రచ్చే!
స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయపతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. వారి దేశభక్తి, అంకితభావం నుంచి నేటి యువత స్ఫూర్తి పొందాలని ఆకాంక్షిస్తున్నాను. #PingaliVenkayya pic.twitter.com/don7rSa66y
— Vice President of India (@VPSecretariat) August 2, 2020
‘ఒక జాతి ఆత్మగౌరవ ప్రతీక జాతీయ జెండా. అలాంటి పతాకాన్ని మన భారత జాతికి అందించిన మహనీయుడు పింగళి వెంకయ్య. ఆయన మన తెలుగువాడు కావడం తెలుగుజాతికి గర్వకారణం. పింగళి వెంకయ్య 1876, ఆగస్టు 2న కృష్టా జిల్లా దివి తాలూకాలోని భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారని’ తెలుగు దేశం పార్టీ తమ అధికారిక ట్విట్టర్లో నివాళులర్పించింది. CoronaVirusపై 110 ఏళ్ల బామ్మ అలవోక విజయం
Today, on his birth anniversary, we show our deep gratitude to freedom fighter Pingali Venkayya for designing our National Flag and dedicating it to the Nation. For his contributions to the mobilisation of the Indian spirit, we are ever thankful. pic.twitter.com/6o5f9X1zRo
— Congress (@INCIndia) August 2, 2020
పింగళి వెంకయ్య 30 దేశాల జాతీయ పతాకాలు, వాటి విశిష్టతలు సమగ్రంగా తెలుసుకుని భారత జాతీయ పతాకాన్ని రూపొందించారు. 1916 నుంచి 1921 వరకు ఐదేళ్లకు పైగా శ్రమించి త్రివర్ణ పతాకానికి రూపమిచ్చారు. 1921 మార్చి 31న విజయవాడలో జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో జాతిపిత మహాత్మాగాంధీ సమక్షంలో పింగళి వెంకయ్య రూపొందించిన పతాకం ఆమోదం పొందింది. Covid-19: తెలంగాణలో కొత్తగా 1,819 కేసులు..
19 ఏళ్ల వయసులో బ్రిటీషు సైన్యంలో చేరారు పింగళి వెంకయ్య. ఆఫ్రికాలో జరిగిన బ్రిటీష్ - బోయర్స్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆపై కొంతకాలానికి జాతీయ ఉద్యమంలో పాలు పంచుకుని స్వాంతంత్య్ర సమరయోధుడిగా.. జాతీయ పతాక రూపశిల్పిగా తన సేవల్ని అందించారు.