వరుసగా నాలుగో రోజూ తగ్గిన ఇంధన ధరలు

పెట్రోలు, డీజిల్‌ ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గాయి.

Last Updated : Jun 2, 2018, 08:06 PM IST
వరుసగా నాలుగో రోజూ తగ్గిన ఇంధన ధరలు

ఢిల్లీ: పెట్రోలు, డీజిల్‌ ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గాయి. శనివారం కూడా లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 9 పైసలు తగ్గాయి. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గడం,  డాలర్‌పై రూపాయి విలువ పెరగడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో పెట్రోల్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.78.20కు, లీటర్ డీజిల్ రూ.69.11కు చేరుకుంది. తగ్గించిన ఈ ధరలు ఆయా రాష్ట్రాల వ్యాట్‌ లేదా స్థానిక్‌ అమ్మకపు పన్నును బట్టి మారుతాయి.

శనివారం ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు:

నగరం పెట్రోల్/లీటర్  డీజిల్/లీటర్
ఢిల్లీ  78.20 69.11
ముంబాయి 86.01  73.58
కోల్‌కతా 80.84 71.66
చెన్నై 81.19 72.97
హైదరాబాద్ 82.88 75.16

వరుసగా 16రోజుల పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు బుధవారం నుంచి రూ. పైసల్లో తగ్గుతూ వస్తున్నాయి. బుధవారం లీటర్‌ పెట్రోల్‌ మీద ఒక్క పైసా, గురువారం 6 పైసలు, శుక్రవారం7 పైసలు తగ్గించారు.  కాగా మే 14 నుంచి వరుసగా 16రోజుల పాటు పెట్రోల్‌ లీటరుకు రూ.3.8, డీజిల్ లీటరుకు రూ.3.38 చొప్పున పెరిగాయి.

 

Trending News